హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: జగన్ మూడు రాజధానుల వ్యూహం అదే..! ఏపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఆగ్రహం

Andhra Pradesh: జగన్ మూడు రాజధానుల వ్యూహం అదే..! ఏపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఆగ్రహం

సీఎం జగన్, జీవీఎల్ నరసింహారావు

సీఎం జగన్, జీవీఎల్ నరసింహారావు

AP Three Capitals: రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని.. కానీ న్యాయవ్యవస్థకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదని అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  ఏపీలో మూడు రాజధానుల అంశం (AP Three Capital Issue)పై రచ్చ జరుగుతోంది. అమరావతి (Amaravati)నే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని అసెంబ్లీ వేదికగా తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌పై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు (G. V. L. Narasimha Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తీసుకొచ్చి.. మూడు రాజధానుల ప్రతిపాదన.. ఒక రాజకీయ ఎత్తుగడ అని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆయన విమర్శించారు. మూడు రాజధానులు దేవుడెరుగు.. మూడేళ్లలో మూడు బిల్డింగ్‌లైనా కట్టారా? మండిపడ్డారు.

  అయితే రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని.. కానీ న్యాయవ్యవస్థకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదని అన్నారు. అమరావతి రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగానే ఉంటుందని మరోసారి చెప్పారు. ఏపీ ఆర్థికవ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తోందని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జీవీఎల్ నరసింహారావు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉందని చెప్పే సీఎం జగన్.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్టెక్కింది. గతంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్త దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసే హైకోర్టు తీర్పు ఉందని అభిప్రాయపడింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం.. రాష్ట్ర అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనన పేర్కొంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని స్పష్టం చేసింది.

  పాలనా, అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేసింది.

  ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని.. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఉంటుందని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా తెగేసి చెప్పారు. అతి త్వరలోనే ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతామని వైసీపీ నేతలు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే ఏపీ పరిపాలన జరుగుతుందని చెబుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Three Capitals

  ఉత్తమ కథలు