సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం.. 15 స్పెషల్ ఫ్లైట్‌లు... 75 మంది ఎంపీలు..

టీడీపీ నేత సీఎం రమేష్

సీఎం రమేష్‌ కుమారుడు రిత్విక్, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో వివాహం నిశ్చయించారు. ఈనెల 23న నిశ్చితార్థం దుబాయ్‌లో జరగనుంది.

  • Share this:
    బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సీఎం రమేష్‌ కుమారుడు రిత్విక్, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో వివాహం నిశ్చయించారు. ఈనెల 23న (శనివారం) దుబాయ్‌లో నిశ్చితార్థం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు భారీగా తరలి వెళ్తున్నారు. సీఎం రమేష్ వ్యాపారవేత్తగా పేరుంది. ఎంపీ కూడా కావడంతో రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. వారందరూ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు వెళ్లేందుకు ఆయన భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వారందరి కోసం సీఎం రమేష్ 15 స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసినట్టు తెలిసింది. అందులో సుమారు 75 మంది వరకు ఎంపీలు, మరికొందరు మంత్రులు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దుబాయ్ బాట పట్టనున్నారు. ఇప్పటికే కొందరు సీఎం రమేష్ సన్నిహితులు మూడు రోజుల ముందే దుబాయ్ చేరినట్టు తెలిసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరుకానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే దుబాయ్‌లో దిగినట్టు సమాచారం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: