బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబంలో మరో విషాదం...

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్ కన్నుమూశారు.

news18-telugu
Updated: December 30, 2019, 8:50 PM IST
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబంలో మరో విషాదం...
ఎంపీ సీఎం రమేష్ (File)
  • Share this:
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్ కన్నుమూశారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ప్రకాష్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఏడాది సీఎం రమేష్ ఇంట్లో ఇది రెండో విషాదం. ఈ ఏడాది సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో తప్పిన ధర్మారామ్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తమ అపార్ట్‌మెంట్ ఏడో ఫ్లోర్ పైకి ఎక్కి దూకేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు