ఏపీ రాజధానిగా నంద్యాలను ప్రకటించే ఛాన్స్...బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు...

కర్నూలు జిల్లాకు సంబంధించి రాజధానికి తగినంత భూమి లేదని, నంద్యాలలో రాజధాని ఏర్పడవచ్చని టీజీ సూచనప్రాయంగా తెలిపారు.

news18-telugu
Updated: August 26, 2019, 10:21 PM IST
ఏపీ రాజధానిగా నంద్యాలను ప్రకటించే ఛాన్స్...బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాష్ట్ర రాజధానిగా అమరావతిలో కాకుండా, నాలుగు ప్రాంతాల్లో నాలుగు రాజధానులుగా, నాలుగు ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, బీజేపీ తరపున కూడా ఆ విషయం పరంగా ఆలోచించి కర్నూలు లో సైతం ఒక రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి రాజధానికి తగినంత భూమి లేదని, నంద్యాలలో రాజధాని ఏర్పడవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. పోలవరం ప్రాజెక్టు టెండరింగ్ విషయంలో విలేకరులు అడిగిన అడిగిన ప్రశ్నకు రాజ్యసభ సభ్యులు సమాధానమిస్తూ రీ టెండరింగ్ అన్న విషయం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల నిధులన్నీ ఆగిపోతాయని తెలిపారు. అదేవిధంగా కర్నూలులో కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మిగనూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన  మీడియా సమావేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు.

tg bharath,tg venkatesh,tdp mp tg venkatesh,tg venkatesh joins bjp,chandrababu naidu,nara lokesh,ap politics,ap news,ysrcp,bjp,kurnool politics
టీజీ వెంకటేశ్
Published by: Krishna Adithya
First published: August 26, 2019, 10:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading