వైసీపీ (YSRCP) పాలనలో సంఘవిద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారని బీజేపీ (AP BJP) ఆరోపించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించి తీరుతామని ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు (Somu Veerraju) ఛాలెంజ్ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన వర్చువల్ బహిరంగ సభలో సోము వీర్రాజు ప్రసంగించారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లాలో బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. దేశద్రోహులవైపు ఉంటారో.. దేశభక్తులవైపు ఉంటారో ముఖ్యమంత్రి తేల్చుకోవాలని సోము స్పష్టం చేశారు. ఆత్మ కూరు ఘర్షణలకు కారణమైన సోషల్ డమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులతో హోంమంత్రి కలవడం తీవ్ర తప్పిదమని సోము విమర్శించారు.
వైసీపీ నేతలు సోషల్ మీడియా లో అభ్యంతర పోస్ట్ లు పెడితే కేసులుండవన్న సోము వీర్రాజు.. బీజేపీ కార్యకర్తలుపై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై కేసు ఎత్తవేయాలని.., గూడూరులో బిజెపి కారర్యకర్తపై చేయిచేసుకున్న సీఐశ్రీ ధర్ పై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బీజేపీ అంటే వైసీపీకి అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు.
ఇక ఇటీవల ఏపీలో సంచలనంగా మారిన గుడివాడ క్యాసినో వ్యవహారంపై సోము వీర్రాజు మండిపడ్డారు. క్యాసినో అని భారతీయ సంస్కృతికి వ్యతిరేకంమని., క్రాంతి సంస్కృతిని చిన్నాభిన్నం చేయడానికి ప్రభుత్వ వ్యవహారం నడిపిందని ఆరోపించారు. ఇలాంటి పనుల వల్ల దేశభక్తులకు అనేక అనుమానాలు జరుగుతున్నాయన్నారు. కేసీనో కు కారణమైన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం వెంటనే తొలగించాలని సోము డిమాండ్ చేశారు. .ప్రభుత్వానికి ఉద్యోగులు కుటుంబ సభ్యులంటున్న సీఎం జగన్.. జీతాలు పెంచకుండా వారిని పస్తులుంచుతున్నరన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై కర్నూలు గడ్డ నుంచే బీజేపీ సమరశంఖం పూరిస్తోందని.. 30నెలల పాటు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేసి 2024లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. మస్లిం మతోన్మాదానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రబుత్వం హిందూ వ్యతిరేక విధానాలు, సంఘవ్యతిరేక శక్తులు కు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇలాగే ముందుకెళ్తే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందన్నారు. ఎమ్మెల్యేలు దేశద్రోహులకు మద్దతు దారుణమన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని జీవీఎల్ హితవుపలికారు.
జగన్ హయాంలో ఐపీసీని వైసీపీగా మార్చారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయన్న ఆయన.. హోం మంత్రి దేశ ద్రోహుల తో టీ తాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఆత్మకూరు ఘటనలో బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై అన్యాయంగా కేసు పెట్టారన్నారు. ఈ ఘటనలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సంఘవ్యతిరేక శక్తులు బలపడకుండా ఉండేందుకు హెచ్చరికగా సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగితే స్పందించని హోం మంత్రి సంఘ విద్రోహశక్తులతో భేటీ అవుతున్నారన్నారు. నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. హిందువులపై దాడులు జరిగితే పోలీసులు హిందువుల కు రక్షణ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.