HOME »NEWS »ANDHRA PRADESH »bjp leader gone missing in guntur district unidentified men took him in the name of interrogation prn gnt

Andhra Pradesh: ఏపీలో కిడ్నాప్ కలకలం.., బీజేపీ నేత అదృశ్యం.., పోలీస్ విచారణ పేరుతో ఎత్తుకెళ్లారా..?

Andhra Pradesh: ఏపీలో కిడ్నాప్ కలకలం.., బీజేపీ నేత అదృశ్యం.., పోలీస్ విచారణ పేరుతో ఎత్తుకెళ్లారా..?
బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) నేత కిడ్నాప్ కలకలం రేపింది. గుంటూరు జిల్లా (Guntur District) సత్తెనపల్లి రూరల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావును అదృశ్యమయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావును అదృశ్యమయ్యారు. ఉదయం 11గంటల సమయంలో కొందరు సత్తెనపల్లి 8వ వార్డులోని సాయిబాబా ఆలయం పక్కనే ఉన్న శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన కొందరువ్యక్తులు ఒంగోలు పోలీసులమని చెప్పి ఆయన్నుతీసుకెళ్లారు. ఆయన్ను ఇంటి నుంచి తీసుకెళ్లిన రెండు గంటల వరకు మొబైల్ పనిచేయగా.. ఆ తర్వాత నుంచి స్విఛ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, సోషల్ మీడియాలో ప్రచారాల నేపథ్యంలో పోలీసుల పేరుతో బీజేపీ నేతను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇటీవల ఆలయాల్లో జరిగిన దాడులకు బీజేపీకి సంబంధం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులే శ్రీనివాసరావును విచారణకు తీసుకెళ్లారా..? లేక రాజకీయ వైరంతో ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు శ్రీనివాసరావు ఆచూకీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక బీజేపీ కార్యర్తలు ఆందోళన చెందుతున్నారు.





    ఉదయం తమ ఇంటికి వచ్చిన కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో ఫేస్ బుక్ ఖాతాలు చెక్ చేసినట్లు తెలిపారు. ఇద్దరి ఫోన్లు పరిశీలించిన తర్వాత తన భర్తను తీసుకెళ్లినట్లు శ్రీనివాసరావు భార్య శిరీష తెలిపారు. ఆయనకు ఫోన్ చేసినా కలవడం లేదని..ఆందోళనగా ఉందన్నారు. బీజేపీ నేతలు మాత్రం శ్రీనివాసరావును కావాలనే ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఆయనకు ఎవరితోనూ వివాదాలు లేవంటున్నారు. నిజంగా పోలీసులే తీసుకెళ్తే ఆయన ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:January 17, 2021, 20:34 IST