విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రజలకు స్వదేశీ, విదేశీ వస్తువులేవో సరిగా తెలీదు. స్వదేశీ వస్తువులు, విదేశీ వస్తువులను ఈజీగా గుర్తు పట్టేలా చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేత అమర్నాథ్. మేకిన్ ఇండియా వస్తువులే వాడాలన్న ప్రధాని మోడీ పిలుపుకు అనుగుణంగా ఆయనీ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో తయారయ్యే వస్తువులు ఏవో తెలిసేలా ఏదో ఒక రంగును వస్తువులపై చేర్చాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరాడు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని విన్నవించాడు. ఆయన తరఫున బాలాజీ యలమంచిలి అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.