జగన్‌కు కౌంటర్ ఇవ్వాలంటే బాలయ్యే కరెక్ట్... బీజేపీ నేత

‘తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనే కరెక్ట్. ఆయన చెబితే దాని ఔన్నత్యం పెరుగుతుంది. ప్రజల్లో కూడా నాటుకుంటుంది.’ అని అంబికా కృష్ణ అన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 8:17 PM IST
జగన్‌కు కౌంటర్ ఇవ్వాలంటే బాలయ్యే కరెక్ట్... బీజేపీ నేత
నందమూరి బాలకృష్ణ, సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి బాలకృష్ణే సరైన వారని బీజేపీ నేత, తెలుగు చలనచిత్ర అభివృద్ది మండలి మాజీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న తెలుగు, ఇంగ్లీష్ మీడియం వివాదంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు సినీ పరిశ్రమలో తెలుగుమీద పట్టున్న ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనే కరెక్ట్. ఆయన చెబితే దాని ఔన్నత్యం పెరుగుతుంది. ప్రజల్లో కూడా నాటుకుంటుంది.’ అని అంబికా కృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో జరుగుతోంది. ఈ వేడుకకు అంబికా కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి మాట్లాడారు. పరోక్షంగా తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియం వివాదాన్ని ప్రస్తావించారు. నందమూరి బాలయ్య వారసుడి కోసం అందరం ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూలర్ సినిమా క్రిస్మస్ నుంచిఉగాది వరకు ఆడాలని అంబికా కృష్ణ ఆకాంక్షించారు. అంబికాకృష్ణ నిర్మాణ సారధ్యంలో నందమూరి బాలకృష్ణ కొన్ని సినిమాలు చేశారు. వీరభద్ర సినిమాకు ఆయనే నిర్మాత. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>