బీజేపీ, జనసేన కీలక సమావేశం ప్రారంభం...పవన్, కన్నా మధ్య చర్చలు

బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక జనసేన తరపున సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు.

news18-telugu
Updated: January 16, 2020, 12:18 PM IST
బీజేపీ, జనసేన కీలక సమావేశం ప్రారంభం...పవన్, కన్నా మధ్య చర్చలు
పవన్ కళ్యాణ్, కన్నా
  • Share this:
విజయవాడ వేదికగా బీజేపీ, జనసేన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక జనసేన తరపున సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. ఈ భేటీ బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ రానున్న నాలుగేళ్లలో ఏపీలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అంతేకాదు అమరావతి రాజధాని అంశంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు తమ అజెండా కాదన్నారు.

రాష్ట్రంలో అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు జీవీఎల్ తెలిపారు. అంతేకాదు 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి వెళ్లడంపై చర్చిస్తామని ఈ సందర్భంగా జీవీఎల్ తెలిపారు.


First published: January 16, 2020, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading