Home /News /andhra-pradesh /

BJP HIGH COMMAND SHOCKED TO THREE MPS WHO CAME FROM TDP NO INVITATIONS FOR PARTY ACTIVITIES NGS

AP Politics: టీడీపీ నుంచి వచ్చిన ఆ ముగ్గురుకు బీజేపీ అధిష్టానం షాకిచ్చిందా..? పార్టీని పార్కింగ్ లా వాడుతున్నారా..?

టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలకు బీజేపీ అధిష్టానం షాక్

టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలకు బీజేపీ అధిష్టానం షాక్

BJP Shock to 3 MPs: భారీ హోప్స్ తో బీజేపీలోకి అడుగు పెట్టారు.. టీడీపీలో గౌరవప్రమధమైన స్థానాలు వదిలి.. కమలం గూటికి చేరారు.. ఇక ఏపీలో చక్రం తిప్పేయొచ్చు అనుకున్నారు.. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంతా రివర్స్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ ముగ్గురు ఎంపీలను అధిష్టానం పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.. ఇంతకీ ఏం జరిగింది..?

ఇంకా చదవండి ...
  BJP Shock to Three MPs: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? అసలు వారి పేరు కూడా ఎక్కడా ప్రస్తావన లేకుండా ఎందుకు పోయింది. టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను (Rajyasabha Members) బీజేపీ (BJP) పక్కన పెట్టేసిందా? అనే ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి (Sujana Chowdary), సిఎం రమేష్ (CM Ramesh), టి.జి. వెంకటేష్ (TG Venkatesh)బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో.. లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ… కండువాలు కప్పేసుకోవడం జరిగిపోయింది. ఈ ముగ్గురూ వారి సొంత అవసరాల కోసమే పార్టీలో షెల్టర్ తీసుకున్నారని వారి చేరికను.. వాళ్లను వ్యతిరేకిస్తూనే ఉంది బీజేపీలోని ఓ వర్గం. మొదట్లో మేమంటేనే బీజేపీ… బీజేపీ అంటేనే మేమే అన్నట్టు కలిసిమెలిసిపోయిన ఆ ముగ్గురు తర్వాతర్వాత అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సుజనా చౌదరి గట్టిపట్టుదలతో ఉండేవారు. కానీ బీజేపీ దానికి అటూ ఇటూగా ఉండేది. ఆయన ఒకటి మాట్లాడితే జీవీఎల్ (GVL)లాంటి వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా మరొకటి మాట్లాడేవారు. దీంతో గ్యాప్ పెరిగింది. సీఎం రమేష్, టీజీలదీ అదే పరిస్థితి. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా వారికి అందడం లేదట. వాళ్లపై అంతర్గతంగా తప్ప… బహిరంగంగా ఇప్పటి వరకు నేతలెవరూ మాట్లాడలేదు.

  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కో ఇంఛార్జ్‌ సునీల్ దేవధర్‌ ఈ మధ్య ఈ మాట అన్నారు. ఓ ముగ్గరు నేతలు పార్టీని పార్కింగ్‌లా వాడేస్తున్నారని నేతల సమావేశంలో అనేశారట. అంతేకాదు.. వారి కార్లకు పంక్చర్ చేసి ఇక్కడ నుంచి కదలకుండా చేసేస్తాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఆ వెంటనే ఆ సమాచారం ఆ ముగ్గురికి వెళ్లడం.. దాని మీద వాళ్లు ఎంక్వైరీ చేసుకోవడం జరిగిపోయాయట. పార్టీ కోసం పార్టీలో చేరితే మమ్మల్ని అలా అని అవమానిస్తారా? అంటూ ఢిల్లీకి ఫిర్యాదులు చేశారట. హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు కానీ.. ఆ ముగ్గురికి పార్టీతో మరింత గ్యాప్ పెంచేశారు దేవధర్‌.

  ఇదీ చదవండి: మళ్లీ తప్పని కరెంటు కోతలు..! ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఇదే..

  దేవధర్‌ వ్యాఖ్యలపై ఎంపీలు చేసిన కంప్లైంట్‌ను హైకమాండ్ ఎలా చూస్తుందో చూడాలి. పార్టీ కూడా దేవధర్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తోందా? లేక ఆయన్నే తప్పుపడుతుందా? అనేది తేలితే…. ఎవరి ప్రయార్టీ ఏంటో తెలిపిసోతుంది. ఒకవేళ హైకమాండ్ ఎంపీల ఫిర్యాదును పట్టించుకోకుంటే… ఢిల్లీ వాళ్లు కూడా పార్కింగ్ ఫీలింగ్ తోనే  ఉన్నట్టే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp, CM Ramesh, Sujana Chowdary, TG Venkatesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు