BJP ANDHRA PRADESH PRESIDENT SOMU VEERRAJU ON TDP CHIEF CHANDRABABU NAIDU LOVE STORY NGS
Somu Veerraju: చంద్రబాబు లవ్ స్టోరీ సీక్రెట్ చెప్పిన సోము వీర్రాజు.. ఆయన ఏమన్నారంటే..?
సోము వీర్రాజు (ఫైల్)
Somu Veerrjau: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లవ్ స్టోరీ హాట్ టాపిక్ అవుతోంది. ఏ పార్టీ నేతలు మాట్లాడినా.. సోషల్ మీడియాలో చూసినా పొలిటిక్ కామెంట్లలో ఈ లవ్ స్టోరీ ట్రెండింగ్ అవుతోంది. అందరూ చంద్రబాబు లవ్ స్టోరీ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఆ లవ్ స్టోరీ వెనుక సీక్రెట్ ను రివీల్ చేశారు సోము వీర్రాజు..
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం హైలైట్ అవుతున్న బీజేపీ (BJP) నేత ఒక్కరే.. ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju).. 2024 ఎన్నికల తరువాత ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉండను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తరువాత ప్రజాగ్రహ సభలో.. చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే హైలైట్ అవుతూనే ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ను అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారింది. ఇతర రాష్ట్రల నేతలు సైతం సోము వీర్రాజును హైలెట్ చేస్తూ వచ్చారు. ఇక సోషల్ మీడియా (Social Media)లో అయితే విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించండి.. తరువాత మద్యం గురించి మాట్లాడంటూ సెటైర్లు వేస్తూ వచ్చారు. ఆ వివాదం ముగియక ముందే ఆయన అల్లుడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే దీనిపైన ఆయన వివరన కూడా హెడ్ లైన్ గా మారింది. తనకు అల్లుడు లేడని.. అతడి వ్యక్తిత్వం నచ్చక.. అతడుతో సంబంధాలు వదిలేసుకున్నాను.. తనకు కూతరు మాత్రమే ఉంది అంటూ వివరణ ఇచ్చారు. ఇలా నిత్యం ఏదో ఒక అంశం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సోమువీర్రాజు తాజాగా చంద్రబాబు లవ్ స్టోరీపై సెటైర్లు వేశారు..
ప్రస్తుతం కుప్పం (Kuppam) పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)తో పొత్తు ఉంటుందా అంటూ ఓ కార్యకర్త వేసిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పారు. లవ్ వన్ సైడ్ ఉంటే ఎలా అని.. అది టూ సైడ్ ఉంటేనే వర్కౌట్ అవుతుందని.. జనసేనపై పొత్తుపై తన మనసులో మాట బయట పెట్టారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు అని ఎద్దేవా చేశారు. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్దుడని వ్యాఖ్యానించారు..
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చాలామందిని లవ్ చేసి.. తరువాత వాడుకుని వదిలేశారు అని సోమువీర్రాజు గుర్తు చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా లవ్ చేశారని.. చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో తన నోటితో తాను చెప్పలేను అని హాట్ కామెంట్లు చేశారు. ఇక, జనసేన పార్టీ తమ మిత్రపక్షం అని మరోసారి స్పష్టం చేశారు సోము వీర్రాజు..
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minster Narendra Modi)కి పంజాబ్ (Punjab)లో ఎదురైన ఘటనపై స్పందించిన ఆయన.. ప్రధాని భద్రతకు భంగం వాటిల్లింప చేసేలా పంజాబ్‌లో పరిస్థితులు సృష్టించారిన మండిపడ్డారు.. ప్రధాని విషయంలో జరిగిన వ్యవహారంపై నిరసనలు తెలియచేస్తాం… ఈ విషయంలో ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కూడా కలవున్నట్టు వెల్లడించారు. అలాగే రేపు మౌనదీక్ష చేయాలని నిర్ణయించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.