హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bird Flu Fears: బ‌ర్డ్ ఫ్లూ రిపోర్ట్స్ కోసం ఉంత్కంఠ‌గా ఎదురు చేస్తోన్న ఏపీ అధికారులు...! తెలంగాణ‌లో బ‌ర్డ్ ఫ్లూ అంటూ ఫేక్ వీడియోలు... ఓల్డ్ సిటీలో కిలో చికెన్ రూ.75 బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్!!

Bird Flu Fears: బ‌ర్డ్ ఫ్లూ రిపోర్ట్స్ కోసం ఉంత్కంఠ‌గా ఎదురు చేస్తోన్న ఏపీ అధికారులు...! తెలంగాణ‌లో బ‌ర్డ్ ఫ్లూ అంటూ ఫేక్ వీడియోలు... ఓల్డ్ సిటీలో కిలో చికెన్ రూ.75 బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్!!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

bird flu fears : మ‌రో రెండు మూడు రోజుల్లో ఏపీలో కాకుల మ‌ర‌ణాల‌కు సంబంధించిన రిపోర్ట్స్ .... రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌ల‌లు ప‌ట్టుకుంటున్న చికెన్ వ్యాపార‌స్తులు!

  కరోనా విలతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఇప్పుడు బ‌ర్డ్ ఫ్లూ భ‌యం వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే ప‌క్క రాష్ట్రాల వ‌ర‌కు పాకిన ఈ వైర‌స్ ఎప్పుడు మ‌న రాష్ట్రాల‌పై ఎటాక్ చేస్తోందోన‌న్న భ‌యంతో తెలుగు ప్ర‌జ‌లు గ‌డ‌గ‌డ‌లాడుతున్నారు. దానికి తోడు తాజాగా గుంటూరు అనుమాస్పద‌ స్థితిలో కాకులు చ‌నిపోవ‌డం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. అయితే ఈ చ‌నిపోయిన కాకులకు సంబంధించిన శాఫిల్స్ ను ఇప్ప‌టికే అధికారులు ల్యాబ్ కు పంపించారు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వ‌స్తే కాని వాటిపై ఒక క్లారీటి రాదంటున్నారు ప‌శుశంవ‌ర్ధ‌క శాఖ అధికారులు. ఇదిలా ఉంటే బ‌ర్డ్ ఫ్లూ భ‌యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రాయాలు అన్యూహా రీతిలో త‌గ్గిపోయాయి. చికెన్ అంటేనే దూరం జ‌రుగుతున్నారు మాంసం ప్రియులు. దీంతో ఫౌల్టీ య‌జ‌మానులు ద‌గ్గ‌ర నుంచి చికెన్ వ్యాపార‌స్తుల వ‌ర‌కు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.

  ఏపీలో కాకుల మ‌ర‌ణానికి సంబంధించి ఒక క్లారీటి వ‌చ్చే వ‌ర‌కు ప‌రిస్థితి ఇలానే ఉంటుందంటున్నారు వ్యాపార‌స్తులు. మ‌రో వైపు ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో అటువంటి అనుమాస్ప‌ద చాయ‌లు ఒక్క‌టి కూడా క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికి అక్క‌డ‌క్క‌డ కొన్ని ప‌క్షులు చ‌నిపోవ‌డాన్ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో విసృతంగా ప్ర‌చారం చేస్తోన్నారు. దీంతో తెలంగాణ‌లో కూడా బ‌ర్డ్ ఫ్లూ భ‌యం వ‌ణికిస్తోంద‌నే చెప్పుకోవాలి. ఇప్ప‌టికే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో చికెన్ కిలో రూ.75 కు ప‌డిపోయిందంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.  అయితే తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంచేందుకు ప్ర‌త్యేకమైన కార్య‌క్ర‌మాలు చేస్తోంది. దీంతో పాటు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పాత వీడియాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు సిద్ద‌మ‌వుతుంది. బ‌ర్డ్ ఫ్లూ అనేది కేవ‌లం అపోహే తెలంగాణ‌లో అలాంటి ఒక్క ఆన‌వాలు కూడా లేదు ప్ర‌స్తుతం కొన్ని కోళ్లు, ప‌క్షులు చ‌నిపోయాయి అని ప్ర‌చారంలో ఉన్న వీడియోల్లో వాస్తవం లేదు...ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో ఉన్న వీడియోల‌న్ని పాత వీడియోలు అని న్యూస్ 18 కి తెల‌పారు ప‌భుత్వానికి చెందిన ఓ ఉన్న‌త ఉద్యోగి.

  ఇదిలా ఉంటే మ‌నం చికెన్ ను  70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వండుకుంటాం కాబట్టి అసలు వైర‌స్ స‌మ‌స్య‌లే ఉండ‌వంటున్నారు కొంద‌రు వైధ్య నిపుణులు. ఏపీలో ల్యాబ్ కి పంపించిన శాపిల్స్ వ‌చ్చే వ‌ర‌కు బ‌ర్డ్ ఫ్లూ పై ఒక నిర్ధార‌కు రాలేమ‌ని అంటున్నారు అక్క‌డ అధికారులు. దీంతోపాటు ఎవ‌రు కూడా ఎలాంటి భ‌యందోళ‌న‌ల‌కు గురికావ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని విజ్ఞ‌ప్తి చేస్తోన్నారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ ఇప్పుడు బ‌ర్డ్ ఫ్లూ త‌మ వ్యాపారాల‌ను పూర్తి స్థాయిలో కుదేలు చేశాయ‌ని వాపోతున్నారు ఫౌల్ట్రీ వ్యాపార‌స్తులు.

  Published by:Balakrishna Medabayani
  First published:

  Tags: Bird Flu

  ఉత్తమ కథలు