రాజకీయాల్లోకి నూతన్ నాయుడు ఎంట్రీ కన్ఫార్మ్... కౌశల్ ఆర్మీ సపోర్టు ఉంటుందా?

విశాఖపట్నం నుంచి పోటీకి సై అంటున్న నూతన్ నాయుడు... కౌశల్ ఆర్మీ తనకే ఉందంటూ ధీమా... జనసేన పార్టీ టికెట్ వస్తుందనే ఆశాభావం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 4, 2019, 7:43 PM IST
రాజకీయాల్లోకి నూతన్ నాయుడు ఎంట్రీ కన్ఫార్మ్... కౌశల్ ఆర్మీ సపోర్టు ఉంటుందా?
నూతన్ నాయుడు, కౌశల్ మందా (Photos: Facebook)
  • Share this:
‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 2 సక్సెస్ కొట్టిందంటే దానికి కారణం కౌశల్ ఆర్మీ. ఓ సాధారణ పార్టిసిపెంట్‌గా ఎంటరైన కౌశల్... హౌస్‌లో ఎదురైన నెగిటివిటీని... బయట పాజిటివిటీగా మలుచుకుని ఫుల్లు క్రేజ్ తెచ్చుకున్నారు. కౌశల్‌కి మిత్రుడిగా, ఆత్మీయుడిగా మెలిగిన నూతన్ నాయుడుకి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘కామన్ మ్యాన్’ కోటాలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన ఈ ‘రిచెస్ట్ బిజినెస్ మ్యాన్’... కొన్ని వారాలు మాత్రమే లోపల ఉండగలిగాడు. ఎలిమినేషన్ తర్వాత కౌశల్ ఆర్మీ సపోర్ట్‌తో రీ-ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే కొన్ని వారాలకే బాబు మళ్లీ బయటికి వచ్చేశాడు.

హౌస్‌లో ఉన్నప్పుడే తనకు రాజకీయాలంటే ఆసక్తి అని... పాలిటిక్స్ వెళతానని ప్రకటించిన నూతన్ నాయుడు... తాజాగా తన ఎంట్రీని కన్ఫార్మ్ చేసేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజికవర్గం నుంచి శాసనసభకు గానీ, పార్లమెంటుకు గానీ పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం అవసరమైన గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంబీఏ పూర్తి చేసి... హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో రీసెర్చ్ ద్వారా డాక్టరేట్ పొందిన నూతన్ నాయుడు... తన కవిత్వంతో ప్రేక్షకులను కొంతమేర బాగానే ఆకట్టుకున్నాడు. ఇన్ఫోసిస్, సిటీ బ్యాంకు లాంటి కంపెనీల్లో పనిచేసిన నూతన్ నాయుడు... స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు కూడా పొందారు.

అయితే బిగ్‌బాస్ హౌస్‌లో నూతన్ నాయుడి ఆటతీరు చాలా మందికి కృత్రిమంగా అనిపించింది. ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో మంచిగా నటిస్తున్నాడనే అనిపించింది కానీ నూతన్ చాలా మంచోడు అని ఎవ్వరూ నమ్మలేదు. అదీ గాక హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు కౌశల్ ఆర్మీని వాడుకున్న నూతన్ నాయుడు... సెకండ్ టైమ్ తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని వాదించాడు. తనకు సరిపడినన్ని ఓట్లు వచ్చినా కావాలనే బయటికి పంపించారని అలిగి... ఫైనల్‌కి హాజరు కాలేదు. ‘నూతన్ నేవీ’ పేరుతో కొంత మంది ఫ్యాన్స్ హడావిడి కూడా చేశారు. అయితే అదంతా నూతన్ చేయించిందే అని అనుమానించేవారు లేకపోలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నూతన్ నాయుడు ‘మా’టీవీకి భారీగా నగదు ముట్టజెప్పాడని, రీ-ఎంట్రీకి కూడా అదే కారణమని కూడా వార్తలు వినిపించాయి. టీవీ కార్యక్రమంలో అయితే డబ్బులు చెల్లించి, తెర మీద కనిపించొచ్చు. రాజకీయాల్లో మాత్రం అది సాధ్యం కాదు. ఎన్ని డబ్బులు పంచినా... పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కూడా కాదు. బాక్సాఫీస్ దగ్గర స్టార్లుగా ఓ వెలుగు వెలిగినవారికి కూడా బ్యాలెట్ బాక్స్ దగ్గర ఓట్లు రాక... చిత్తుగా ఓడిన సందర్భాలెన్నో. అలాంటిది నూతన్ నాయుడికి ఓట్లు పడే అవకాశం ఉందా?

ఈ బిగ్‌బాస్ ‘నటుడు’కి ఏ పార్టీ టికెట్ ఇస్తుంది... మొదట్నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సూక్తులు, కవిత్వాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే నూతన్ నాయుడిని పవన్ కల్యాణ్ ‘గ్లాస్’ ఇమేజ్ గట్టెక్కించగలదా? అనే విషయం అందరికీ తెలిసిందే.First published: January 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>