Big Shock to YCP Leaders: ఊరించి ఊరించి కేంద్రం ఉసూరు మనిపించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయం అని కేంద్ర హోం శాఖతో పాటు.. బీజేపీ (BJP) పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారు. ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని నిలదీస్తే.. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ (MP GVL) కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని.. ఆ విషయం తెలిసినా ఏపీ ప్రభుత్వం.. ప్రజలను మభ్య పెడుతోంది అన్నారు. ఇంకా కచ్చితంగా ప్ర్తత్యేక హోదా కావాలి అంటే.. రాష్ట్రానికి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలా అంటూ ప్రశ్నించారు.. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు భిన్నంగా.. ఆదేశాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశపు అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు కమిటీలో ఉంటారని చెప్పింది.
అయితే ఈ విషయం బయటకు రాగానే.. వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చారు.. ప్రత్యేక హోదా రాదని విపక్షలు అంటున్నాయని.. కానీ సీఎం జగన్ ఆ హోదాను బతికించారంటూ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే రోజా అయితే ఓ అడుగు ముందుకు వేసి.. జగన్ అంటే ఏంటో తెలిసిందా అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.. కేంద్రం కుదరదు అన్నదాన్ని కూడా సుసాధ్యం చేయించడం జగన్ విజయం అన్నారు. చంద్రబాబు పాతర వేసిన అంశాన్నిసైతం జగన్ ప్రాణం పోసారంటూ జబర్దస్త్ డైలాగ్ లు పేల్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీతో రాజీపడ్డ చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు అన్నారు రోజా.
ఇదీ చదవండి : తగ్గేదే లే అంటున్న ఫైర్ బ్రాండ్.. ఇది మా విజయం అంటున్న ఎమ్మెల్యే రోజా..
ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించడం చాలా సంతోషకరమైన వార్త అని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రధాని మోదీ, అమిత్‌షా దగ్గర ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, తన స్వార్థం కోసం ప్యాకేజీకి ఒప్పుకుని, హోదా రాకుండా అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ నియమించిన త్రిసభ కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని చేర్చడం శుభ పరిణామమని బాలశౌరి తెలిపారు.
ఇదీ చదవండి : కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నాయా..?ఇలా చెప్పొచ్చు.. పత్యేక కమిటీ ఏర్పాటు
అయితే ఇలా వైసీపీ నేతలు వరుసగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రత్యేక హోదా అంశానికి తమదే క్రెడిట్ అంటూ వరుస కామెంట్ల దాడి చేశారు. అయితే అలా మాటల తూటాలు పేల్చిన.. వైసీపీ నేతలకు ఒక్కసారి గాలి తీసేసినట్టు అయ్యింది.. కేంద్రం అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. అజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్ జారి చేసింది. సమావేశం ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను కేంద్ర హోంశాఖ చేర్చింది.
దీనిపై మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. పొరపాటును కేంద్ర హోంశాఖ గ్రహించిందన్నారు. ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని జీవీఎల్‌కు హోం శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిధిలోకి రాని ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు సహా మరికొన్ని అంశాలను ఎజెండా నుంచి తొలగించిందన్నారు. తాజాగా సవరించిన ఎజెండాతో తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్రం.. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం ఫోకస్ చేస్తోంది అన్నారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ నెల 17న త్రిసభ్య కమిటీ తొలి భేటీ జరుగుతుంది అని వెల్లడించారు.
ఇదీ చదవండి : ఏపీలో మెగా స్టూడియో..? ప్లేస్ ఫైనల్ చేశారా..? అదే దారిలో మహేష్..!
ఏదీఏమైనా.. తాజాగా కేంద్రం ప్రభుత్వం సవరించిన ఉత్వర్వులు మాత్రం టీడీపీ అధినేతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే వైసీపీ నేతలు.. దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఇప్పటికే దాదాపు కీలక వైసీపీ నేతలంతా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాతరేస్తే..జగన్ ప్రాణం పోసారంటూ.. గొప్పలు చెప్పారు.. దీంతో టీడీపీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది.. కానీ ఇంతలోనే కేంద్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.