Home /News /andhra-pradesh /

BIG TWIST IN DWARAKA TEMPLE ACCOUNT ONE EMPLOYEE WRONG ENTRY AMOUNT NGS

Dwaraka Tirumala: ద్వారకా తిరుమల విరాళాల్లో కోట్లలో తేడా..? చివరికి బయటపడ్డ ట్విస్ట్.. షాక్ అయిన అధికారులు

ద్వారకా తిరుమల ఆలయం (ఫైల్)

ద్వారకా తిరుమల ఆలయం (ఫైల్)

Dwaraka Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే ఆలయాలకు.. భారీగా విరాళాలు వస్తాయి. కోట్లలో కూడా విరాళాలు ఉంటాయి. అయితే అక్కడ లెక్కలు కూడా అంతే పక్కాగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులు తప్పవు. అయితే తాజాగా ద్వారాకా తిరుమలలో జరిగిన లెక్కల వ్యవహారం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. ఆధార్ కార్డు కోట్లలో తేడాలకు కారణమైందని తెలిసి అతా నోరెళ్లబెడుతున్నారు.

ఇంకా చదవండి ...
  Dwaraka Tirumala: ఏలూరు జిల్లా (Eluru District) ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని చిన తిరుపతిగా కూడా పిలుస్తారు. నిత్యం భారీగా భక్తులకు ఆలయానికి వస్తూ ఉంటారు. తిరుమల వెళ్లడం సాధ్యపడని వారు సైతం ఈ చిన్నతిరుపతికు
  వెళ్తుంటారు.  అదే స్థాయిలో వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారికి విరాళాలు కూడా అందుతాయి. లక్షలు, కోట్లల కూడా విరాళాలు అందుతున్న సందర్భాలు గురించి వింటూనే వింటాం.  అందుకు తగ్గట్టే లెక్కలు కూడా పక్కాగానే ఉండాలి. ప్రతీదీ ఆన్ రికార్డుల్లో చూపించాల్సి ఉంది. వందల్లో తేడాలు వచ్చినా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలకు సంబంధించి విషయం కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే కానుకలు.. హుండి ద్వారా వచ్చే అదాయం విషయంలో పూర్తి రికార్డులు మెయింటెన్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఆ లెక్కలను
  సరిచేసుకుంటూ ఉంటారు.  అలా లెక్కలు సరిచేసుకుంటున్న సమయంలో కోట్ల రూపాయాల్లో తేడా కనిపించడంతో అధికారులు, సిబ్బందికి చెమటలు పట్టాయి. అన్ని కోట్లు ఎలా మిస్ అయ్యాయో తెలియక తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

  ఏం జరిగిందనే విషయం ఆరా తీస్తే..  ఆలయంలో ఉద్యోగి చేసిన చిన్న తప్పు బయటపడింది. అతడు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా కోట్ల రూపాయల తేడా వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) తణుకుకు చెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాడు.  స్వామి చెంతకు వచ్చిన ప్రతి సారి తనకు తోచిన విధంగా విరాళం ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా తూర్పు రాజగోపురం ప్రాంతంలో ఉన్న కౌంటర్‌లో నిత్య అన్నదానం ట్రస్టుకు ఆయన విరాళం చెల్లించారు. అయితే ఈ చెల్లింపు విషయంలో లెక్కలు తారుమారు అవ్వడంతో గందరగోళం నెలకొంది.  ఆ భక్తుడు 2 వేల 116 రూపాయలు విరాళంగా చెల్లించారు. అలా భక్తుడు ఇచ్చిన డబ్బులను ఆలయ ఉద్యోగి భక్తుడు రికార్డుల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు.. దీంతో మొత్తం సీన్ మారిపోయింది. సదరు భక్తుడు రెండు వేల నూట పదహార్లు ఇస్తే.. 8 కోట్ల రూపాయలచకు పైగా విరాళం చెల్లించినట్లు పొరపాటున ఆన్‌లైన్‌లో ఎంటర్ చేశాడు. కానీ అప్పుడు ఆ విషయాన్ని గమనించలేదు. లెక్కల్లో తేడా ఉందని తెలిసిన తరువాత.. రసీదులు చూస్తే అసలు విషయం బయటపడింది.

  ఇదీ చదవండి : పొత్తుల సంగతి ఓకే.. గ్లాసు గుర్తు మాటేంటి.? కామన్ సింబల్ పోరాటం ఫలించేనా..?

  నిత్య అన్నదానానికి భక్తుడు విరాళం ఇచ్చిన వెంటనే..దేవస్థానం ఉద్యోగి విరాళానికి సంబంధించి రసీదును భక్తుడికి అందించారు. ఆయన
  వెళ్లిపోయాడు.. తర్వాత అదే రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో లెక్కలు చూశారు. అప్పుడు కోట్లలో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు.

  ఇదీ చదవండి : ఉపాధ్యాయుల వెన్నులో వణుకు.. జగన్ సర్కార్ సంస్కరణలతో భయం భయం

  ఆ తర్వాత సరిగ్గా పరిశీలిస్తే.. ఈ విషయం బయటపడింది. వెంటనే ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. అనంతరం లెక్క సరి చేసుకున్నారు. ఆలయ ఉద్యోగి 2116లు బదులు ఆధార్ నెంబర్ టైప్ చేశాడు. దీంతో ఆన్‌లైన్‌లో డబ్బుల్లో తేడాలు రావడంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు ఇబ్బందిపడ్డారు. మొత్తానికి ఉద్యోగి చేసిన తప్పుతో అందరూ కంగారుపడ్డారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Eluru, Hindu Temples

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు