సోనూసూద్ నుంచి ట్రాక్టర్ అందుకున్న రైతు వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

చిత్తూరు జిల్లాలోని రైతు నాగేశ్వరరావుకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనే దానిపై ఏపీ ప్రభుత్వం ఆరా తీయడంతో... అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

news18-telugu
Updated: July 27, 2020, 10:37 PM IST
సోనూసూద్ నుంచి ట్రాక్టర్ అందుకున్న రైతు వ్యవహారంలో కొత్త ట్విస్ట్..
సోనూ సూద్ సాయం (sonu sood help)
  • Share this:
కూతుళ్ల సాయంతో పొలం దున్నిన వ్యవహారం ద్వారా నటుడు సోనూసూద్ దృష్టిని ఆకర్షించిన చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. రైతు నాగేశ్వరరావు పరిస్థితి చూసి అతడికి ట్రాక్టర్‌ను పంపించాడు నటుడు సోనూసూద్. దీంతో ఈ మొత్తం వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షించింది. రైతుకు ట్రాక్టర్‌ను పంపించి ఆదుకున్న సోనూసూద్‌ను అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు... నాగేశ్వరరావు కూతుళ్ల బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. అయితే అసలు చిత్తూరు జిల్లాలోని రైతు నాగేశ్వరరావుకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనే దానిపై ఏపీ ప్రభుత్వం ఆరా తీయడంతో... అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.


కేవలం సరదా కోసం కూతుళ్లతో ఆ రకంగా నాగేశ్వరరావు పొలం దున్నారని సమాచారం. ఆ వీడియో కాస్త వైరల్ కావడం... సోనూసూద్ స్పందించి ట్రాక్టర్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే రైతు నాగేశ్వరరావు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినట్టు ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వరరావు ఖాతాలో వేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ చేసింది. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ చేసింది. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 ప్రభుత్వం అందించింది. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు.

chittoor sisters, sisters become oxes, చిత్తూరు, నాగలి పట్టిన అక్కాచెల్లెళ్లు, నాగలి పట్టిన కూతుళ్లు, Sonu Sood, సోనూసూద్
సోనూసూద్ ఇచ్చిన ట్రాక్టర్‌తో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు


చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది. ఇక నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్‌ అందుకుంటోంది. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వరరావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌ కూడా తీసుకుంది. ఇక తనకున్న రెండు ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు.

ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా లబ్ది పొందుతున్న నాగేశ్వరరావు.. సరదా కోసం చేసిన వీడియో ద్వారా అందరి దృష్టిని ఆకర్షించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సోనూసూద్ ఇచ్చిన ట్రాక్టర్‌ను తిరిగి ఆయనకే ఇవ్వడం లేదా గ్రామ పంచాయతీకి ఇవ్వాలనే యోచనలో రైతు నాగేశ్వరరావు ఉన్నట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: July 27, 2020, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading