ఎంపీ సుజనాకు భారీ ఝలక్... రూ.400 కోట్ల ఆస్తుల వేలం

ఎంపీ సుజనా చౌదరికి భారీ షాక్ తగిలింది. రూ.400 కోట్ల విలువైన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రకటన జారీ చేసింది. 

news18-telugu
Updated: February 20, 2020, 6:49 PM IST
ఎంపీ సుజనాకు భారీ ఝలక్... రూ.400 కోట్ల ఆస్తుల వేలం
సుజనా చౌదరి
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించి రూ.400 కోట్ల విలువైన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రకటన జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన చెన్నై కార్పొరేట్ బ్రాంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ వెంగళరావు నగర్‌కు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిలను చెల్లించనందున, ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయడంతో పాటు ఆ కంపెనీకి రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సుజనా యూనివర్సల్ కంపెనీ సుజనా చౌదరికి చెందినది. ఆ సంస్థ తీసుకున్న బ్యాంక్ లోన్లకు గ్యారెంటీ సంతకాలు పెట్టిన వారు అంటూ సుజనా చౌదరి, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్తల పేర్లను బ్యాంక్ ప్రకటించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన వేలం నోటీస్


ఈ ఆక్షన్‌లో పాల్గొనదలిచిన వారు మార్చి 20వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మార్చి 21వ తేదీ నాటికి టెండర్లు దాఖలు చేయాలని కోరింది. 23వ తేదీన ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ఆక్షన్ నిర్వహించనున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు