హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నిలిచిపోయిన భీమ్లానాయక్ సినిమా.. కారణం ఏంటంటే..?

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నిలిచిపోయిన భీమ్లానాయక్ సినిమా.. కారణం ఏంటంటే..?

నిలిచిపోయిన భీమ్లానాయక్ షో

నిలిచిపోయిన భీమ్లానాయక్ షో

Bheemla Nayak: పవన్ కల్యాణ్ అభిమానులకు బిగ్ షాక్.. తన అభిమాన హీరో సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారికి ఊహించని షాక్ తగిలింది. టికెట్ రేటు ఎంత ఉన్నా.. సినిమాకి వెళ్లాలనే ఉద్దేశంతో థియేటర్ కు వెళ్లిన వారు అక్కడ పెట్టిన నోటీస్ బోర్డు చూసి నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.. సినిమా ప్రదర్శించలేమని థియేటర్ యాజమాన్యం నోటీసులు అంటించింది.

ఇంకా చదవండి ...

  Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా విడుదల అంటే.. మెగా అభిమానులకు పండుగే.. తమ ఆరాధ్య నటుడి సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. రెండు మూడు రోజుల ముందు నుంచి ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ఆ సమయం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే భారీగా.. కోట్లాది అభిమానుల కోలాహలం మధ్య భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా విడుదల అయ్యింది. కొన్ని చోట్ల మాత్రం థియేటర్ యాజమాన్యాలు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాం అంటూ బోర్డులు పెట్టారు. ఎక్కడ అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని థియేటర్లలో ఇలాంటి నోటీసు బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఆయా థియేటర్ల దగ్గర పవన్ అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఎంతో ఆశతో సినిమా చూద్దామని వస్తే.. ఇలా షాకిస్తే ఎలా అని మండిపడుతున్నారు. వెంటనే థియేటర్లు ఓపెన్ చేయాలని.. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యాలు సైతం తమ బాధను కూడా పవన్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాయి. ఇంతకీ సమస్య ఏంటంటే..?

  ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల ఇలాంటి బోర్డులు దర్శనం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే..? ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. మార్చి తొలివారంలో టిక్కెట్ రేట్లపై కొత్త జీవో అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజే విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడితోనే ఆగలేదు.. ఏ థియేటర్ యాజమాన్యం అయినా.. టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా, అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వంప ప్రకటించిన ధరలతో సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదంటున్నాయి థియేటర్లు యాజమన్యాలు.. అందుకే ఇలాంటి నోటీసులు బోర్డులు పెడుతున్నాయి. 

  ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరంలో భీమ్లా నాయక్ ప్రదర్శించే థియేటర్ లకు 35 రూపాయలు కేటాయించడంతో థియేటర్ యజమానులు తీవ్ర అసహనంతో వున్నారు. ఈ రేట్ తమకు గిట్టబాటు కాదని భీమ్లా నాయక్ ప్రదర్శించుటకు సిద్ధంగా లేమని ప్రకటించారు. దీంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.  సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

  గత వారం విడుదలైన సినిమాలకు వంద రూపాయలకు పెంచిన ప్రభుత్వం తమ హీరో సినిమా విడుదల సందర్భంగా జీవో ప్రకారమే టికెట్లు రేట్లు అమ్మాలని చెప్పటం ఎంతవరకు సబబు అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని హీరోలందరి సినిమాలను ప్రభుత్వం ఒకేలా ఆదరించాలని రాజకీయంతో ముడిపెట్టొద్దని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  ఇదీ చదవండి : పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదే? వర్గ పోరుతో ఢీ అంటే ఢీ అంటున్నారు.? కారణం ఏంటి..?

  తాజా పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరంలో భీమ్లానాయక్ ప్రదర్శించే థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తగ్గించిన టిక్కెట్ ధరలతో భీమ్లానాయక్ సినిమా తమకు గిట్టుబాటు కాదని సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గేటు బయట నోటీసు అతికించడంతో సినిమా కోసం వచ్చిన పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అటు ప్రకాశం జిల్లా ఇంకొల్లులోనూ భీమ్లానాయక్ సినిమా ప్రదర్శన నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bheemla Nayak, Pawan kalyan

  ఉత్తమ కథలు