హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore Chicken: సండే సరదాగా చికెన్ తినాలి అనుకుంటున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?

Nellore Chicken: సండే సరదాగా చికెన్ తినాలి అనుకుంటున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?

చికెన్ ప్రియులకు అలర్ట్

చికెన్ ప్రియులకు అలర్ట్

Nellore Chicken: సండే వచ్చింది అంటే నాన్ వెజ్ ప్రియులకు పండుగే..? చికెన్.. మటన్ షాపులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అలా అని చికెన్ కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..? తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Nellore Chicken: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాన్ వెజ్ ప్రియులంతా (Nonveg Lovers) సండే కోసం ఎదురు చూస్తుంటారు.. సండే వచ్చిదంటే హ్యాపీగా చికెన్ మార్కెట్ (Chicken Market)ల్లో వాలిపోతుంటారు. అందుకే కార్తీక మాసంలో కూడా చికెన్ కు ఈ మధ్య డిమాండ్ తగ్డడం లేదు.. సాధారణంగా ఆదివారం వస్తే చాలు నాన్‌వేజ్‌ ప్రియులంతా చికెన్ దుకాణం దగ్గర బారులు తీరుతుంటారు. వారి నుంచి వస్తున్న డిమాండ్ చూసి.. వ్యాపారస్తులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కల్తీ చికెన్ ను అమ్మేస్తూ కాసులు దండుకుంటున్నారు. ముఖ్యంగా కుళ్ళిన వాటిని నిల్వ ఉంచి విక్రయదారులకు ఇట్టే అమ్మేస్తున్నారు. ఈ విషయాలు ఏమీ తెలియని అమాయకులు ఆ కుళ్ళిన చికెన్ ను తీసుకొని తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ సమీపంలోని మాంసపు దుకాణాల్లో కుళ్లిన కోడి మాంసం విక్రయాలు బయటపడ్డాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యవహారం బయటపడింది.

తాజాగా అధికారుల తనిఖీల్లో భారీ స్థాయిలో కుళ్లిపోయిన చికెన్ పట్టుబడింది. చెన్నై నుంచి కోడి మాంసంతో పాటు కోడి లివర్ తరలిస్తున్న వాహనంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా చెన్నై నుంచి దిగుమతి చేస్తున్న 300 కిలోల కోడి లివర్ మాంసాన్ని సీజ్ చేశారు. ఆ మాంసం, లివర్ కుళ్లిపోయి ఉంది. ఆరిఫ్ అనే వ్యాపారి ఈ కుళ్లిన చికెన్ ను చెన్నైలో కొనుగోలు చేశాడు. ఆరిఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట తనఖిలీ చేస్తున్నా..? వ్యాపారుల తీరు మాత్రం మారడం లేదు. దాడులు జరుగుతున్నా.. కొన్ని రోజుల తరువాత మళ్లీ అదే బాటలో వెళ్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన కుళ్లిన చికెన్ విక్రయాల వ్యవహారం చికెన్ ప్రియులను షాక్ కి గురి చేస్తోంది. ఇన్నాళ్లూ తాము తిన్నది ఆరోగ్యకరమైనదో కాదోనని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి : హిందూపురంలో టెన్షన్ టెన్షన్.. రేపు బంద్ కు పిలుపు.. ముందుగానే అఖిల పక్ష నేతల అరెస్టులు

కేవలం కాసుల కక్కుర్తితో కొందరు మాంసం విక్రయదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇతర ప్రాంతాల కుళ్లిన మాంసాన్నే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాన్ని డీప్ ప్రిడ్జ్ లో పెట్టి.. స్మెల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో భారీ ఉద్యోగ మేళా.. అర్హతలు ఇవే

సాధారణంగా నాన్ వెజ్ విషయంలో చాలా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. కేవలం డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు వ్యాపారులు దిగజారిపోతున్నారు. ప్రమాణాలు పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ  ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇలాంటి కుళ్లిన చికెన్ తింటే అనారోగ్యం ఖాయం అని, జబ్బుల బారిన పడతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలకే ప్రమాదం ఉందంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chicken, Nellore Dist

ఉత్తమ కథలు