Big shock to common People: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఓ వైపు నిత్యావసర ధరలు మండుతున్నాయి. వీటికి తోడు ఇటీవల విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు (Electricity Charges Hike).. ఆ బాధ నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం.. ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ (APSRTC Charges Hike) నిర్ణయం తీసుకుంది. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలు తప్పని సరి పరిస్థితుల్లో పెంచుతున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమల రావు (RTC MD Dwaraka Tirumalarao) స్పష్టం చేశారు. తాజా రేట్ల ప్రకారం ఇకపై పల్లె వెలుగు బస్సుకు 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్ బస్ పై 5 రూపాయలు, ఏసీ బస్సుకు 10 రూపాయలు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ పెరిగిన ధరలు కూడా రేపటి నుంచే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ద్వారకా తిరుమల మాటల్లనే చెప్పాలి అంటే.. ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చింది అన్నారు. అయితే సామాన్యులపై భారం ఎక్కువ పడకూడదనే ఉద్దేశంతో డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం అన్నారు. దాని ప్రకారం.. పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయలు పెంచుతున్నామన్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 5 రూపాయలు పెంచుతున్నమని.. ఏసీ బస్సుల్లో 10 రూపాయలు పెంచుతున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన మాజీ మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..?
తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. ఇకపై పల్లె వెలుగు బస్సులో కనిష్ఠ ఛార్జి 10 రూపాయలు ఉంటుంది అన్నారు. అలాగే డీజిల్ సెస్ కారణంగా ఏడాదికి 720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం వుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుందన్నారు. అలాగే కోవిడ్ వల్ల గత రెండేళ్ల కాలంలో 5680 కోట్లు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తాజా పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెంచుతున్నది బస్సు చార్జీలను కాదని చెప్పిన ఆయన కేవలం తాము టికెట్‌పై సెస్ మాత్రమే విధిస్తున్నామన్నారు. ఇక పెరిగిన ఇంధన ధరల కారణంగా ఆర్టీసీపై పడే నష్టాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇందులో భాగంగా ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దీనిపై గతం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. చివరికి అది కార్యరూపం దాల్చేందుకు అడుగులు పడ్డాయి.
ఇదీ చదవండి : అగ్రవర్ణాలను సీఎం జగన్ దూరం పెట్టారా..? అసలు వైసీపీ లెక్కేంటి..?
ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. తాజాగా ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. మరోవైపు ఏపీలో ఇప్పటికే రాష్ట్రంలో పెరిగిన పలు రకాల చార్జీలపై విపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఆర్టీసీ చార్జీల పెంపు వారికి మరో ఆయుధాన్ని ఇచ్చినట్టు అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Apsrtc