Janasena Symbol:జనసేనానికి బిగ్ షాక్.. చేజారిన గ్లాస్.. 2025కు గుర్తు లేనట్టే..

జనసేన అధినేత పవన్ కు షాక్

  • Share this:
    Janasena Party Symbol UnRecognised: జనసేన (janasean) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో ఆ పార్టీ పోటీ చేసే వేళ.. పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల (Regional Parties)హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్‌ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP)కి సీలింగ్‌ ఫ్యాన్‌ (Fan) గుర్తు, టీడీపీ (TDP)కి సైకిల్‌ (Cycle) గుర్తు, టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీకి కారు (CAR) గుర్తులు రిజర్వుడ్‌ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ (National Parties) హోదాలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), సీపీఎం (CPM), సీపీఐ (CPI), తృణమూల్‌ కాంగ్రెస్ (Trunamul Congress), బీఎస్పీ (BSP), ఎన్సీపీ (NCP), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలకు రిజర్వుడ్‌ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్‌సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్‌ గుర్తులు కేటాయించింది.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో ఫ్రీ సింబల్స్‌ కేటగిరిలో పేర్కొంది. అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్‌ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గుర్తు చేసింది.

    గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

    ఇదీ చదవండి: సినీ పరిశ్రమ జోలికి వస్తే అంతు చూస్తాం.. సన్నాసి మంత్రి అంటూ సెటైర్.. అన్నయ్యకు స్వీట్ వార్నింగ్

    వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనిజనసేన భావించటమే కాదు.. అందుకు తగ్గట్లు కసరత్తు చేసింది కూడా. పవన్ పార్టీ బరిలో ఉంటే.. తమ ఓట్లు చీలే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరటంతో.. పవన్ ఓకే చెప్పి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్లకు ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్ గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

    ఇదీ చదవండి: ప్రధానికి అమెరికా బహుమతి.. 157 పురాతన వస్తువులు, కళాకండాలను తిరిగి తీసుకురానున్న మోదీ

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా.. తాము పోటీ నుంచి తప్పుకున్నామని.. తమకు తమ గాజు గ్లాస్ ను కామన్ సింబల్ గా కేటాయించాలని రిక్వెస్టు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. జనసేన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవటంతో రిజెక్టు చేసినట్లుగా పేర్కొంది. దీంతో..2025 నవంబరు 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
    Published by:Nagesh Paina
    First published: