Shcoking Video: మత్స్యకారులు (Fisherman) నిత్యం వేట (Fish Hunting)కు వెళ్తుంటారు.. అయినా రోజూ విధితో పోరాటం చేస్తారు.. ఒక్కోసారి వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కదు.. కానీ ఒక్కోసారి లక్షలు ధర పలికే చేపలు (Costly Fishes) వలకి చిక్కి.. వారి జీవితాలను మార్చేస్తాయి. ఒక్కరోజే లక్షల కురిపిస్తాయి. ఇలాంటి అద్భుతాలు అప్పడప్పుడూ జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఓ మత్యకారుడు (Fisherman) వేసిన వలలో దొరికింది చూసి అంతా షాక్ అయ్యారు. ఇది నిజంగా అద్భుత ఘటనే అంటున్నారు. చూడగాని ఆధ్యాత్మికత ఉప్పొంగేలా చేసిన అందమైన అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) విగ్రహం తన వలలో పడడం చూసి.. ఆ జాలరి ఇప్పటికీ ఆశ్చర్యంలో ఉన్నాడు. అసలు సముద్రంలోకి అయ్యప్ప విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అతడికి అంతు చిక్కలేదు. కాకినాడ జిల్లా (Kakinada District) .. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది.
అచ్చం దశావతారం సినిమాలో జరిగినట్టే విగ్రహం దొరకడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఆ మూవీలో విష్ణుమూర్తి విగ్రహం ఏ విధంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిందో అదే రీతిలో.. కడలి నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం ఉద్భవించింది. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సూరాడ శివ అనే మత్స్యకారుడు వలలో అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించడంతో.. దాన్ని లాగిన మత్స్యకారుడు.. లోపల అయ్యప్ప విగ్రహం ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
Ayyappa Swamy || జాలార్ల వలకు చిక్కిన అయ్యప్ప స్వామి || ప్రత్యేక పూజలు చ... https://t.co/abeDmSLfQF via @YouTube #FishingGirls #fishing #fishinglife #fish #fishbowl #AYYAPPA
— nagesh paina (@PainaNagesh) November 15, 2022
వెంటనే ఆలస్యం చేయకుండా.. తోటి మత్స్యకారుల సహాయంతో ఒడ్డుకి చేర్చాడు. ఆపై విగ్రహాన్ని సుబ్బంపేట రామాలయాలని తీసుకెళ్లారు. అయితే ఆ విషయం చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో.. అక్కడికి స్థానికులు పోటెత్తుతున్నారు. రాతితో చెక్కబడి.. చెక్కుచెదరని సుందర రూపంలో కూడిన విగ్రహం కావడంతో అందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు.
అయ్యప్ప స్వామి భక్తులకు సైతం భారీగా వచ్చి.. పూజలు చేస్తున్నారు. కడలి నుంచి తమ వల ద్వారా ఒడ్డుకు చేరిన ఆ అయ్యప్ప విగ్రహానికి గుడి కట్టాలని మత్స్యకారులు ఆలోచిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం అయ్యప్ప భక్తులు మాలలు ధరించే సమయం. అంతేకాదు అయ్యప్ప విగ్రహాన్ని ఎవ్వరూ నిమజ్జనం చేయరు. మరి ఈ విగ్రహం ఎలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది హరిహర పుత్రుడి మహత్యమే అంటున్నారు భక్తులు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ పూజలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fishermen, Kakinada, Lord Shiva