BIG SHOCK TO BHEEMLA NAYAK IN ANDHRA PRADESH TO LATE TAKE DECISION ON TICKETS PRICE ISSUE NGS
Big Shock to Bheemla Nayak: భీమ్లా నాయక్ కు బిగ్ షాక్..! ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందా..?
‘భీమ్లా నాయక్’ బిగ్ షాక్ (Twitter/Photo)
Big Shock to Bheemla Nayak: భీమ్లా నాయక్ కు బిగ్ షాక్ ఇస్తోందా ప్రభుత్వం.. ఉద్దేశ పూర్వకంగా అలా చేస్తోందా.? ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుంటే.. ఇక్కడ మాత్రం కష్టాలు తప్పేలా లేవు. దీంతో ప్రభుత్వం తీరుపై పవన్ అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Big Shock toBheemla Nayak: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు కూడా.. మొదట జనవరి 12, 2022 న భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని పెద్ద సినిమాలకు లైన్ క్లియర్ చేయడం కోసం ఈ సినిమా వాయిదా వేశారు. సంక్రాంతి తరువాత సినిమా రిలీజ్ చేయాలని భావించినా.. ఏపీలో సినిమా టికెట్ల (Movie tickets rate Issue in AP) ధరలు తగ్గించడం.. చాలావరకు సినిమా థియేటర్లు మూతపడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తే వచ్చారు. ఇటీవల సినిమా ప్రముఖులు స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని కలవడం.. ఈ సందర్భంగా టికెట్ల ధరలు పెంచనున్నట్టు హామీ ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది. ఇటు కరోనా కేసులు తగ్గడం.. అటు ఏపీ ప్రభుత్వం (AP Government)తో సమస్య సెటిల్ అవ్వడంతో.. భారీ ఎత్తున శివరాత్రికి అంటే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది..
భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న సినిమా కావడంతో.. తెలంగాణ ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా రెండు వారాల పాటు ఐదు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐదో షో అనుమతి లేకపోవడం ఒకటైతే.. ఏపీలో సినిమా ధరల టికెట్లు పెంచే విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. కేవలం భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతోందనే కారణంతోనే ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసిందని విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి : టీఆర్ఎస్ మెగా ప్లాన్.. బీజేపీపై కీలక అస్త్రం సిద్ధం చేస్తున్న గులాబీ నేతలు
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే.. ఇటీవలం సినీ ప్రముఖులను కలిసిన సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం. ఫిబ్రవరి 28వ తేదీ లోపే టికెట్ల రేట్లను పెరిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు టికెట్ల ధరలపై వేసిన కమిటీ సైతం రిపోర్ట్ ను ప్రభుత్వాని ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ నుంచే సవరించిన టికెట్ ధరలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. దీంతో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సైతం సంతోషం వ్యక్తం చేసింది.. తమ సినిమా రిలీజ్ టైంకు లైన్ క్లియర్ అయ్యిందని సంతోషించారు.. ఫిబ్రవరి 25న సినిమా రిలీజ్ కు సిద్ధయ్యారు. కానీ ఈ లోపే ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకున్నట్టు ఉందని పవన్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వానికి తెలుసని.. కానీ పవన్ సినిమా రిలీజ్ కు ఉందనే కారణంతోనే టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే విషయంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.