Home /News /andhra-pradesh /

BIG SHOCK TO AP GOVERNMENT EMPLOYEES NEW PRC AND DA GO THEY FEEL LOW SALARY FROM THIS MONTH NGS GNT

Big Shock to Employees: ఉద్యోగులకు సర్కార్ షాక్.. డీఏ బకాయిలు, పీర్సీల జీవోల్లో ఏముందంటే?

వైఎస్ జగన్

వైఎస్ జగన్

Big Shock to Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం మొదలైంది. మొన్న ఊ అన్న ఉద్యోగ సంఘాల నేతలు.. ఇప్పుడు ఏ అనాలో తెలియడం లేదు. ఇప్పటికే కొన్ని ఉద్యోగ సంఘలు మాత్రం మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ జీవోలు మరింత దుమారం రేపే ప్రమాదం ఉంది.

ఇంకా చదవండి ...
  Big Shock to Employees:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు, పీఆర్సీ (PRC)ల జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. 2019 జులై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల డీఏలను విడుదల చేసింది. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వలను జారీ చేశారు. పీఆర్ సీకి సంబంధించి 23 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా ఎన్నాళ్లగానో డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగుల కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP  Government) ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను విడుదల చేయడానికి ఆర్దికశాఖ డిసెంబర్ లోనే అధికారిక ఉత్తర్వులిచ్చింది. నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఒకేసారి ఐదు పెండింగ్ డీఏ లను జనవరి జీతాలతో కలిపి విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా 23 శాతం ఫిట్మెంట్ తో పెరిగిన జీతాలు కూడా ఈనెలతోనే కలిపి ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 న పెరిగిన జీతాలు విడుదల కానున్నాయి. కానీ ఇంటి అద్దె భత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మాత్రం ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

  సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది. ప్రధానంగా ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగుల, ఉద్యోగసంఘాల డిమాండును బేఖాతర్‌ చేసింది. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది.  2019 జులై నుంచి 27 శాతం మేర చెల్లించిన మధ్యంతర భృతి విషయంలోనూ ఉద్యోగులకు షాక్ తప్పలేదు. అదనంగా ఇచ్చిన 4 శాతం విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  ఇదీ చదవండి : నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. నిబంధనలు ఇవే.. థియేటర్లు, ఆలయాలపై ఆంక్షలు.. వీరికి మినహాయింపు

  తాజాగా ప్రభుత్వం జీవో కారణంగా.. పీఆర్సీ అమలు కారణంగా తమకు వేతనాలు పెరగకపోగా.. తగ్గిపోతుందని ఉద్యోగులు అంచనాలు వేస్తున్నారు. అయితే గత డీఏలు ఇప్పుడు ఇవ్వడంతో కొంతమేర మొత్తం వేతనంలో పెరుగుదల కనిపిస్తుందని.. అదే డీఏలన్నీ ముందే ఇస్తే ఈ పీఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని చెబుతున్నారు.

  ఇదీ చదవండి : విద్యార్థుల క్షేమం కోసం స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలి.. చంద్రబాబు డిమాండ్

  ఇక పీర్సీ నివేదికలో ముఖ్య అంశాలు ఏంటంటే..?
  తాజాగా సవరించిన మాస్టర్‌ స్కేలులో 32 గ్రేడులు ఉంటాయి. అలాగే 2018 జులై 1 నుంచి నోషనల్‌గా కొత్త పీఆర్సీ అమలవుతుంది. అది ఈ ఏడాది జనవరి జీతాల నుంచే పీఆర్సీ అమలు ప్రభావం ఉంటుంది. 2022 సవరించిన వేతన స్కేళ్లు నిర్ణయించే క్రమంలో మధ్యంతర భృతిని పరిగణనలోకి తీసుకోకూడదని జీవోలో ఉంది. అలాగే సచివాలయ ఉద్యోగులతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఉద్యోగులకు 16 శాతం అద్దె భత్యం.. మిగిలిన జిల్లాల్లో ఉన్నవారికి 8 శాతం అద్దెభత్యం వర్తిస్తుంది. దీంతో పాటు గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షల రూపాయల వరకు పెంచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇకపై రాష్ట్ర పీఆర్సీకి గుడ్ బై చెప్పేసినట్టే.. ఇకపై కేంద్ర ప్రభుత్వ తరహాలోనే కొత్త పీఆర్సీ అమలు చేస్తారు.

  ఇదీ చదవండి : పండుగ కిక్కే వేరప్ప.. ఐదు కోట్ల మాంసం.. 32 కోట్ల మద్యం.. ఎక్కడో తెలుసా?

  2004 తర్వాత విధల్లో చేరిన సీపీఎస్‌ ఉద్యోగులకు.. మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో.. నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అంటే ఈ ఏడాది జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు, 2023 మార్చి నెలల్లో చెల్లిస్తారు. అదే 2004కు ముందు ఓపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు మధ్యంతర భృతిని సర్దుబాటు చేసిన తర్వాత బకాయిలను నాలుగు వాయిదాల్లో జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల్లో జమచేస్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్కేళ్ల వర్తించే విధంగా చర్యలు తీసుకుంటారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Employees

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు