హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Police Clarity: ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు విషయంలో క్లారిటీ.. అధికారులు ఏమన్నారంటే..?

Police Clarity: ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు విషయంలో క్లారిటీ.. అధికారులు ఏమన్నారంటే..?

ట్రాఫిక్ చలాన్లపై అన్యమత ప్రచారం పై పోలీసులు ఏమన్నారంటే?

ట్రాఫిక్ చలాన్లపై అన్యమత ప్రచారం పై పోలీసులు ఏమన్నారంటే?

Police Clarity: ట్రాఫిక్ ఛాలన్లపై మత ప్రచారం చేస్తున్నారంటూ పెను దుమారం రేగింది. ట్రాఫిక్ చలాన్లపై అన్యమత ప్రచారం ఏంటి అని హిందువులు.. ఇటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విశాఖ పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు.. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Police Clarity: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్యమత ప్రచారంపై పెను దుమారం రేగుతోంది. తాజాగా విశాఖ (Visakha) లో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ఉద్దేశంతో ఎవరో చేసింది కాదని క్లారిటీ ఇచ్చారు. విశాఖ రైల్వేస్టేషన్‌ (Visakha Railwaystation) లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే ఆటోస్టాండ్‌లో ప్యాసింజర్స్‌కి ఇచ్చే టోకెన్లపై మతపరమైన కీర్తనలు ఉండటం వివాదానికి తెరలేపింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియా (Social Media) లో వైరల్‌గా మారాయి. దాంతో విశాఖ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు ట్రాఫిక్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరుగుతోందని బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. అసలు సూత్రధారులు, పాత్రధారులను ప్రజల ముందు నిలబెట్టాలని తిరుపతిలో డిమాండ్ చేశారాయన. ఈ ఘటనపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆటోస్టాండ్‌లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లు అయిపోవడంతో గమనించకుండా పొరపాటున వేరే టోకెన్లు ఇవ్వడం జరిగిందని పోలీస్‌శాఖ తెలిపింది. కొత్త టోకెన్లు తీసుకురావాలని ప్రీపెయిడ్ ఆటో సెక్రటరీకి అక్కడి సిబ్బంది చెప్పడంతో.. అతడు బైబిల్ వాక్యాలతో కూడిన టోకెన్లను తీసుకువచ్చారని చెప్పింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అది గమనించకుండాలనే ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చారని వివరణ ఇచ్చారు. ఇదంతా పొరపాటుగా జరిగిందని .. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేసింది.

Please Watch Press Meet Video@APPOLICE100 #dgpapofficial #visakhapatnamcitypolice pic.twitter.com/M7KMpNSi99

ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా విశాఖ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. పలువురు నెటిజన్లకు సమాధానమిచ్చిన సిటీ పోలీసులు.. ఓ ఆటోడ్రైవర్‌ తన అజ్ఞానంతో హెడ్‌ కానిస్టేబుల్‌కు అందజేసిన స్లిప్పులను అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ చేశాడని వెల్లడించింది. వెంటనే వాటిని నిలిపివేశామని వివరణ ఇచ్చింది.

ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ

పోలీసుల వివరణపైనా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బాగానే కథలు చెప్పారని.. ఎప్పటికీ తీరు మారదా అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై కఠినంగా ఉండకపోతే.. అన్యమత ప్రాచారాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారనమైన వారిపై చర్యలు తీసుకోవాలి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Supreme Court

ఉత్తమ కథలు