Home /News /andhra-pradesh /

BIG SHOCK TO ANDHRA PRADESH GOVERNMENT NEXT TIME MUST DEPOSIT IN VIDHYA DIVENA AMOUNT IN COLLEGES NGS

Big Shock: ఇకపై తల్లుల అకౌంట్ లో ఆ నగదు పడదు.. సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

వైఎస్ జగన్

వైఎస్ జగన్

Big Shock: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు తల్లుల ఖాతాలో వేస్తున్న విద్యా దీవెన కానుక నగదు.. ఇకపై కాలేజీల ఖాతాలో వేయాల్సి ఉంటుంది.. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఇంకా చదవండి ...
    Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) మరో ఎదురుదెబ్బ తగిలింది.  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh  Highcourt) తీర్పు షాక్ మళ్లీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya deevena) ఒకటి.. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు.  వైఎస్‌ జగన్‌ మోహన్  రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం.. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

    గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

    ఇదీ చదవండి : సీఎం పై సెటైర్.. జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. పరుగులు పెట్టించిన బ్యానర్

    జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్నితల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. కానీ తాజా తీర్పుతో ఇకపై విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

    ఇదీ చదవండి : వైసీపీ పాలనపై RRR మూవీ సాంగ్ తో పేరడీ.. వైరల్ గా మారిన ట్వీట్

    మరి తాజా తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. గతంలో విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును కోరారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌ర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పట్టి.. కాలేజీ యజమానుల వాధనను ఏకీభవించింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా కొట్టేయంతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే అని చెప్పాలి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP High Court, AP News, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు