హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shock to AP Government: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. 805 కోట్ల బిల్లులను తిప్పి పంపిన కేంద్రం

Shock to AP Government: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. 805 కోట్ల బిల్లులను తిప్పి పంపిన కేంద్రం

Central Government shock to ap government: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ పెట్టింది. సుమారు 4,068 కోట్ల రూపాయల తాగునీటి నిధుల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలు చెప్పింది. 805 కోట్ల రూపాయల బిల్లులను వెనక్కి పంపింది.

ఇంకా చదవండి ...

  Central Government shock to Andhra Pradesh government: కేంద్ర ప్రభుత్వం (Central Government)తో సఖ్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం (Ap Government) ప్రయత్నిస్తున్నా.. అన్ని విషయాల్లో షాక్ లు తప్పడం లేదు. తాజాగా పోలవరం ప్రాజెక్టు (Polavaram)కు సంబంధించిన నిధుల విడుదలపై కేంద్రం కొర్రీలపై కొర్రీలు వేస్తోంది. ప్రాజెక్టులో తాగునీటి విభాగం కింద 4,068.43 కోట్లు ఇవ్వబోమంటూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా అభ్యంతరాలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభ్యర్థన మేరకు కేంద్ర జలశక్తి శాఖ పంపిన ప్రతిపాదనలను సైతం తిరస్కరించింది. ఈ విభాగం కింద నిధులిచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాగు, సాగునీటి విభాగమంటూ విభజించి కోత పెట్టవద్దని.. ఆ నిధులూ ఇవ్వాల్సిందేనని రాష్ట్రం మళ్లీ అభ్యర్థించనుంది. నిధుల విడుదల ఆవశ్యకతను ప్రస్తావించనుంది. ప్రాజెక్టుకు ఇక కేవలం 7,053 కోట్లు మాత్రమే ఇస్తామని, అంతకుమించి ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక శాఖ బాంబు పేల్చి ఏడాది గడిచింది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు రాష్ట్రం ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో కోట్ల సొమ్ము రాష్ట్రం ఖర్చు చేస్తున్నా బిల్లులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇతరత్రా అనేక అంశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలు ఏంటంటే..?

  ప్రాజెక్టు ప్రధాన డ్యాం, పునరావాసం, భూసేకరణ, కుడి ఎడమ కాలువల విభాగాలవారీగా ఎంతెంత నిధులు అవసరమో లెక్కించారు. గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాస్తూ ఇక ఇవ్వబోయే 7,053 కోట్లలో ఏ విభాగంలో ఎంత నిధులిచ్చారో.. ఎంత ఇవ్వాలో పేర్కొన్నారు. ఇవ్వబోయే నిధులను అలాగే ఇస్తామని తెలిపారు.

  ఇదీ చదవండి: ఆశలు రెట్టింపు చేస్తున్న బంతి పూల సాగు.. ఎకరానికి ఎన్ని లక్షలు సంపాదించొచ్చో తెలుసా..?

  డీపీఆర్ ‌2లోని 47,725 కోట్ల రూపాయలకు ఇంకా కేంద్రం ఆమోదించాల్సి ఉన్నందున ఈలోపు విభాగాలవారీగా విధించిన పరిమితిని పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్రం కోరింది. ఈ డిమాండ్‌ను కేంద్ర జలవనరుల శాఖ తిరస్కరించింది. విభాగాల పరిమితి దాటి నిధులివ్వబోమని తేల్చిచెప్పింది. 805 కోట్ల బిల్లులను కేంద్రం తిరస్కరించింది.

  ఇదీ చదవండి: అమ్మో ఉల్లి.. కట్ చేయకుండానే కన్నీరు.. కారణం అదే అంటున్న నిపుణులు

  గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్న ప్రకారం.. ఆయా విభాగాల కింద కొత్తగా సమర్పిస్తున్న బిల్లులకు కేంద్రం నిధులివ్వడం లేదు. ఈ రకంగా ఇంతవరకు 805.68 కోట్ల బిల్లులను తిరస్కరించారు. ఇందులో కుడి, ఎడమ కాలువల బిల్లులు 284.63 కోట్లు ఉండగా.. భూసేకరణ బిల్లులు 285 కోట్లున్నాయి. మిగిలినవి పాలనాపరమైన ఖర్చులు.

  ఇదీ చదవండి:కూల్‎డ్రింక్ అనుకుని విషం తాగిన చిన్నారులు.. ఇంట్లోకి విషం ఎలా వచ్చింది.. తండ్రి తెలిసే చేశాడా? లేక..?

  ఇంకా తేలనివి

  ప్రాజెక్టు పనులు చేపట్టవద్దంటూ కేంద్ర అటవీ పర్యావరణశాఖ గతంలో నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు స్టే ఎత్తివేయిస్తూ పనులు చేయిస్తున్నారు. 2021 జులై 2 వరకు మాత్రమే పనులకు అనుమతి ఉంది. పొడిగింపు ఇంకా రాలేదు. 47,725.74 కోట్లకు పెట్టుబడి అనుమతిని కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కేంద్ర జలశక్తిలో ఇందుకు సంబంధించి ఎలాంటి కదలిక లేదు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Central governmennt, Polavaram

  ఉత్తమ కథలు