BIG SHOCK TICKET TO ANDHRA PRADESH GOVERNMENT TO HIGH COURT STAY TO ONLINE TICKETS SALES NGS
Big Shock: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాలపై స్టే
ప్రతీకాత్మకచిత్రం
Big Shock to AP Government: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా టికెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించాలనుకున్న జగన్ సర్కార్ కు.. హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. టికెట్ల వ్యవహారంపై ఏం చెప్పిందంట..?
Big Shock to AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సినిమా టికెట్ల వ్యవహారంలో మొదటి నుంచి సర్కార్ పట్టుదలతోనే ఉంది. ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ లైన్ లోనే టికెట్లు విక్రయించాలని (Movie online ticket Issue) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ థియేటర్ యాజమన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (AP High Court).. జగన్ సర్కార్‌కు (Ys Jagan Government) షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలపై స్టే ఇచ్చింది. ప్రస్తుతానికి జీవో 69న నిలిపివేయాలని చెప్పింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.. తాజా కోర్టు తీర్పుతో ప్రస్తుతానికి ప్రభుత్వం నిర్ణయానికి బ్రేకులు పడినట్టే..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నజీవో నెంబర్ 69 ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుక్ మై షో, మల్టీప్లెక్స్‌లు విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడినట్టే..
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు సంబంధించిన యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా, సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయానికి కారణం కూడా చెప్పింది ఏపీ ప్రభుత్వం. బ్లాక్ టికెట్ల విధానానికి స్వస్తి పలికి, తక్కువ ధరకే వినోదం అందించేందుకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అధికారులు. దీని ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణంగా ఇతర ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా బుక్ చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా 20 నుంచి 25 రూపాయల వరకూ భారం పడుతోందని చెప్పారు. APSFTVTDCతో ఒప్పందం చేసుకునే థియేటర్లకు, టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా థియేటర్లు ఇతర ఆన్లైన్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయనే అపోహలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టళ్లతో పాటు, ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవొచ్చని తెలిపారు అధికారులు.
అయితే దీంతో తమకు నష్టాలు తప్పవని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యవహారం పై న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆన్ లైన్ సినిమా టికెట్లప్రక్రియ పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన జివో 69ని నిలిపివేస్తూ తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది కోర్టు. ప్రధాన పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తికావాల్సి ఉంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.