వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress Party)కి హ్యాకర్లు షాకిచ్చారు. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ (Twitter Account Hack) చేసిన దుండగులు ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను మార్చారు. అలాగే ఆ అకౌంట్ లో క్రిప్టో కరెన్సీ (Cripto Cureency)కి సంబంధించిన పోస్టులు పెట్టారు. కానీ ట్విట్టర్ అకౌంట్ (Twitter Account) లోని వైసీపీకి సంబంధించిన పోస్టులను మాత్రం అలాగే ఉంచారు. హ్యాకింగ్ పై అలెర్ట్ అయిన వైసీపీ టెక్నీకల్ టీం (Ycp Technical Team) రంగంలోకి దిగింది. ట్విట్టర్ అకౌంట్ ను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా కొన్ని రోజుల క్రితం టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ( TDP Twitter Account) కూడా హ్యాక్ (Hack) అయిన విషయం తెలిసిందే.
????To support crypto community, Elon Musk initiated 5.000 BTC and 100.000 ETH GIVEAWAY
????First come,first served: https://t.co/nV9MalCPDu ????Note: you can take a gift only once. Please hurry up!!! — YSR Congress Party (@YSRCParty) December 10, 2022
స్పందించని వైసీపీ నేతలు..
కాగా వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ (Twitter Account Hack) కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే దీనిపై వైసీపీ నాయకులూ ఎవరూ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. మరికాసేపట్లో ట్విట్టర్ హ్యాక్ (Twitter Account Hack) గురించి నాయకులు మాట్లాడే అవకాశం ఉంది. అయితే ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ (Twitter Account Hack) చేసిన దుండగులు అందులో వైసిపికి సంబంధం లేని ఫోటోలు, క్రిప్టో కమ్యూనిటీకి సంబంధించిన వాటిని ఉంచారు.
కలకలం రేపుతున్న హ్యాకింగ్ ఘటనలు..
కాగా దేశంలో రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ట్విట్టర్ అకౌంట్ లు యాడ్ చేయడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇక ఇప్పుడు ఏపీ అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను హ్యాకర్లు హ్యాక్ (Twitter Account Hack) చేయడం కలకలం రేపుతోంది. రంగంలోకి దిగిన వైసీపీ టెక్నీకల్ టీం రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఇటీవల టీడీపీ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ (Twitter Account Hack) కు గురైన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Ap, AP News, Twitter, Ycp