ఏపీ హైకోర్టు (Ap High Court)లో అమరావతి రైతులకు బిగ్ షాక్ తగిలింది. నిబంధనలు సవరించాలని రైతులు వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు (Ap High Court). పాదయాత్రలో గత నిబంధనలే పాటించాలన్న కోర్టు రైతుల పిటీషన్ ను కొట్టేసింది. కేవలం 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని మరోసారి హైకోర్టు (High Court) స్పష్టం చేసింది.
కాగా అమరావతి(Amravati)ని రాజధాని చేయాలని రైతులు చేపట్టిన పాదయాత్ర ఇటీవల 41వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో (Ramachandra Puram) బైపాస్ రోడ్డు నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రైతులు రాత్రి బస చేసిన ఫంక్షన్ హాల్ ను పోలీసులు చుట్టుముట్టారు. రైతులకు, మద్దతు తెలపడానికి బయట నుంచి లోపలికి ఎవ్వరిని పోలీసులు రానివ్వడం లేదు. రైతులకు (Farmers) సంఘీభావం తెలపడానికి వచ్చే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి :టీడీపీ నియోజకవర్గాలపై సీఎం ఫోకస్.. 175 గెలవొచ్చు.. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అన్న జగన్
అయితే కేవలం 600 మంది అమరావతి (Amravati) రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని కోర్టు (Ap High Court) సూచించింది. అనుమతి పొందిన రైతులు వారి ఐడి కార్డులను చూయించండి. అలాగే అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతా వాటిని అనుమతించబోమని పోలీసులు అన్నారు. దీనితో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక పోలీసుల తీరుపై మండిపడ్డ ఐకాస నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రను నిలిపివేసి పోలీసుల తీరుపై హైకోర్టుకు (High court) వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు హైకోర్టులో (Ap High Court) పిటిషన్ కూడా వేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని లాయర్లు కోరడం.. రైతులు 600 మంది మాత్రమే పాల్గొంటారని చెప్పిన పిటిషనర్లు, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. కానీ నేడు రైతుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు (Ap High Court) గతంలో హైకోర్టు సూచించిన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో కేవలం 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని కోర్టు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP High Court, AP News, AP Three Capitals, Highcourt