Shock to Government: సెంటు భూమిలో ఇళ్లా..? నిర్మాణాలు చేపట్టవద్దన్న కోర్టు.. జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

AP High Court

Big Shock to Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల సంగతి కలగానే మిగిలిపోనుందా..? తాజా పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశానికి ఎవో అడ్డకులు తప్పడం లేదు. తాజాగా హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే ఇచ్చింది.

 • Share this:
  Highcourt on Houses: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకానికి మరో బ్రేక్ పడింది. ఈ పథకంలోని లోపాలను ఏపీ హైకోర్టు (AP Highcourt) ప్రశ్నించింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.

  కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్‌ 10,11,12, జీవో 99లోని క్లాజ్‌ బీ,డీలను చట్టవిరుద్ధమైనవంటూ, వాటిని రద్దుచేసింది.

  ఇదీ చదవండి: 2024 నాటికి ఏపీలో మారనున్న రాజకీయాలు.. ఎవరు ఎవరితో పొత్తుపై క్లారిటీ..?

  నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు బీఎస్‌వో 21, ఏపీ అసైన్డ్‌ భూముల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. మహిళలతో పాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ పట్టాలు ఇవ్వాలంది. మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం.. అధికరణ 14, 15(1),39కి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఆ నిర్ణయం మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకమంది.

  ఇదీ చదవండి: మంత్రి అవంతి బెర్త్ దక్కేదెవరికి..? రేస్ లో ఉన్నామంటున్న సీనియర్లు

  పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల ఇళ్ల స్థలాలు/హౌసింగ్‌ యూనిట్లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవోలను సవాలుచేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది డిసెంబరులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల స్థలాలను మహిళలకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆంజనేయులు వాదనలు వినిపించారు. మహిళలకే ఇళ్లపట్టాలు ఇవ్వడంపురుషులు, ట్రాన్స్‌జెండర్లపై వివక్షేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని స్థలం కేటాయించామన్నారు.

  ఇదీ చదవండి: నలుగురూ అమ్మాయిలే.. అబ్బాయి కావాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు

  మరోవైపు గృహ నిర్మాణంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది.. కొద్దిసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం జాతీయస్థాయిలో ఉన్న పథకం కంటే ఉత్తమమైనదిగా ప్రభుత్వం ఆ పిటిషన్ లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని.. అందుకే హస్ మోషన్ పిటిషన్ వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది.
  Published by:Nagesh Paina
  First published: