Big Shock to BJP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ (BJP) కి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) రాజీనామా చేశారు. రాజీనామా లేఖను.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కు పంపిస్తానని కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు కన్నాతో పాటు మరో 15 మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కన్నా సంచలన వ్యాఖ్యలు.. 2014 ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరాను అన్నారు.. కానీ ప్రస్తుతం పార్టీలో పరిస్థితి పూర్తిగా మారిపోయాయని ఆరోపించారు.. ముఖ్యంగా ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత.. పరిస్థితి మరి దారుణంగా మారిందన్నారు. ఆయన పార్టీని తన సొంత సంస్థలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పార్టీలో ఇక తాను ఏ మాత్రం ఇమడలేకపోతున్నాను అన్నారు కన్నా..
తాను బీజేపీ పార్టీని వీడుతున్నా.. మోదీనికి జీవితకాలం అభిమానిగానే ఉంటాను అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోము వీర్రాజలు నిర్ణయాలతో రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. సోము బాధ్యతలు చేపట్టకముందు పార్టీలో ఉన్ పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంపట్ల ఆకర్షితులై బీజేపీలో చేరి అప్పటినుంచి ఈరోజు వరకు ఏ స్థాయిలో ఉన్నా పార్టీ బలోపేతానికి తాను పనిచేసుకుంటూ వచ్చాను అన్నారు. ఆ వెంటనే పార్టీలో తన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం 2019 ఎన్నికలకు పది మాసాల ముందు ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు శక్తిమేర కృషి చేశానని తెలిపారు.
ఇదీ చదవండి : డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని .. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..
ఎన్నికల తరువాత మోదీ నాయకత్వంలో ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేయటం మొదలు పెట్టానని అన్నారు. ఈ క్రమంలో అనేక మంది మాజీ ఎంపీ, మాజీ మంత్రులు, అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరారని తెలిపారు.
ఇదీ చదవండి : వైసీపీలో మొదటి, చివరి టాప్ 10 ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా..? సీఎం జగన్ ఏం చెప్పారంటే..?
అలాగే అధిష్టానం నిర్ణయం మేరకే అమరావతి ఉద్యమం నుంచి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై పోరాటం చేశాను అన్నారు. కానీ సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో పరిస్థితులు బాగాలేదని, ఆ పార్టీలో పరిస్థితులకు ఇమడలేక రాజీనామాచేస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తన భవిష్యత్ ప్రణాళికను తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ఇదీ చదవండి: అవినీతిని ప్రశ్నిస్తే మహిళల్ని కించపరిచినట్టా..? మళ్లీ రోజాపై లోకేష్ సెటైర్లు
కేవలం సోము వీర్రాజు పైనే కాదు.. ఎంపీ జీవీఎల్ తీరుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కాపులకు ఏం చేశారని.. జీవీఎల్ సన్మానాలు చేయించుకున్నారని ప్రశ్నించారు.. విజయవాడ జిల్లాలకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసినా..? పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kanna Lakshmi Narayana, Somu veerraju