విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ.. డాక్టర్ భార్య, కూతురి చేతులు కట్టేసి..

విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ.. డాక్టర్ భార్య, కూతురి చేతులు కట్టేసి..

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని.. ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లవ్స్ ధరించారని తెలిపారు. మధ్యాహ్నం 3 తర్వాత ఘటన జరిగిందని.. దొంగలు గంట సమయం పాటు ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు.

  • Share this:
    విజయవాడలో పట్ట పగలే భారీ దోపిడీ జరిగింది. మాచవరంలో ఓ ప్రముఖ డాక్టర్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. డాక్టర్ భార్యా పిల్లలపై దాడిచేసి రూ.50 లక్షల విలువైన సొమ్మును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం డాక్టర్ మురళీధర్ ఇంట్లో చోరీ జరిగింది. ముఖానికి మాస్క్‌లు ధరించిన దుండగులు డాక్టర్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఆయన భార్య, కూతురిపై దాడిచేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేశారు. అనంతరం ఇంట్లో నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై డాక్టర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని.. ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లవ్స్ ధరించారని తెలిపారు. మధ్యాహ్నం 3 తర్వాత ఘటన జరిగిందని.. దొంగలు గంట సమయం పాటు ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు. డాక్టర్ భార్య, కూతురిని చంపేస్తామని బెదిరించి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: