చంద్రబాబుకు ఊరట...కోర్టులో వ్యక్తిగత హాజరు అవసరంలేదు!

గత నెల రోజులుగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కేసులో...వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు చంద్రబాబుకు ఊరట కలిగించింది.

news18-telugu
Updated: October 12, 2018, 5:08 PM IST
చంద్రబాబుకు ఊరట...కోర్టులో వ్యక్తిగత హాజరు అవసరంలేదు!
ఏపీ సీఎం చంద్రబాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 12, 2018, 5:08 PM IST
మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఈనెల 15వ తేదీన ధర్మాబాద్ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు కోర్టు మినహాయింపు కల్పించింది. అంతకు ముందు ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాది వేసిన బాబ్లీ ప్రాజెక్టు కేసు రీకాల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. గంటన్నర పాటు ఇరుపక్షాల వాదనలు సాగాయి.

వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు మినహాయింపు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా కోర్టుకు విన్నవించారు. బాబు తరుపు న్యాయవాది విన్నపాన్ని మన్నించిన న్యాయస్థానం బాబు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాలను ఉపసహరించింది. ఆ మేరకు ఈ నెల 15న వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు మినహాయింపు కల్పిస్తూ కోర్టు ఊరట కలిగింది.

బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నెలక్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడం కలకలం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ప్రోద్భలంతోనే కోర్టు చంద్రబాబుకు అరెస్టు వారెంట్లు జారీ చేసిందని ఏపీ, తెలంగాణలోని టీడీపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. మొత్తానికి ఈ వివాదం  రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు కోర్టు మినహాయింపు కల్పించడం ఆయనకు ఊరట కలిగించే అంశం.First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Countdown
Countdown To Assembly Elections 2018 Results
  • 01 d
  • 12 h
  • 38 m
  • 09 s
To Assembly Elections 2018 Results