హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్..ఓఎంసీ కేసులో అభియోగాలు కొట్టివేసిన హైకోర్టు

Big News: సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్..ఓఎంసీ కేసులో అభియోగాలు కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మి వ్యవహరించారని ఆమెపై అభియోగాలున్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. కాగా 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా శ్రీలక్ష్మి పని చేశారు. ఆమెపై అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మి వ్యవహరించారని ఆమెపై అభియోగాలున్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. కాగా 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా శ్రీలక్ష్మి పని చేశారు. ఆమెపై అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ అభియోగాలను శ్రీలక్ష్మి ఖండించింది.

చదువు అవసరం లేదు, ఉచితంగా శిక్షణ, రోజు కూలీ కూడా..! మంచి అవకాశం వినియోగించుకోండి

ఇండస్ట్రియల్ సెక్రెటరీగా తన పరిధి దాటకుండా..వ్యవహరించారని శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలను వినిపించారు. కింది కోర్టు నుండి పై కోర్టు వరకు శ్రీలక్ష్మి వాదనలు వినిపించింది. మైనింగ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఓఎంసి వ్యవహారాలను చూశారని ఆమె తరపు లాయర్లు చెప్పుకొచ్చారు. అయితే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా కూడా గాలి జనార్దన్ రెడ్డికి మేలు జరిగేలా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. 6 మాసాలుగా ఉన్న లీజును మూడేళ్లకు పొడిగించారని సీబీఐ వాదించింది.

ఇది చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వేల ఉద్యోగాలతో జాబ్ మేళా.. వివరాలివే..!

అయితే ఓఎంసి మైనింగ్ లీజు కేటాయించే సమయానికి మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా శ్రీలక్ష్మి లేరని ఆమె తరపు న్యాయవాది గుర్తు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సమయంలో సుప్రీంకోర్టు ఓఎంసి కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరతిగతిన విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు విచారణ జరిపింది.  ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది.

కాగా శ్రీలక్ష్మి ప్రస్తుతం ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వున్నారు. ఇక తాజాగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.

First published:

Tags: Highcourt

ఉత్తమ కథలు