ఉత్తరాంధ్రకు తప్పిన గండం : ఒడిశా వైపు దిశ మార్చుకోనున్న 'ఫని' తుఫాన్

తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాయలసీమ జిల్లాల్లో గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఫొని తుఫాను తీవ్రత గంటకు 16కి.మీ వరకు పెరిగిందని.. మచిలీపట్నానికి 900కి.మీ, చెన్నైకి 770కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

news18-telugu
Updated: April 30, 2019, 7:17 AM IST
ఉత్తరాంధ్రకు తప్పిన గండం : ఒడిశా వైపు దిశ మార్చుకోనున్న 'ఫని' తుఫాన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 7:17 AM IST
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫని తుఫానుగా మారడంతో ఉత్తరాంధ్రకు మరోసారి ముప్పు తప్పదన్న వార్తలు వచ్చాయి. అయితే తుఫాన్ దిశ ఒడిశా వైపు కదిలడంతో.. ఉత్తరాంధ్రపై అంతగా ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఒడిశా మీదుగా బెంగాల్ వైపు తుఫాన్ పయనిస్తుందని చెబుతున్నారు. అయితే రాబోయే రెండు, మూడు రోజుల్లో ఫని తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కొద్దిమేర ఉంటుందని.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మే 3, 4 తేదీల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చునని తెలిపారు.

తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాయలసీమ జిల్లాల్లో గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఫొని తుఫాను తీవ్రత గంటకు 16కి.మీ వరకు పెరిగిందని.. మచిలీపట్నానికి 900కి.మీ, చెన్నైకి 770కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 1వ తేదీ వరకు తుఫాన్ దిశ ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటుందని.. అదే రోజు ఒడిశా వైపుగా దిశ మార్చుకుని వెళ్తుందని తెలిపింది.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...