Bandla Ganesh Offer: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Actor Bandla Ganesh), వైసీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) మధ్య ట్విట్టర్ (Twitter) ఫైట్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్ది మధ్య సోషల్ మీడియా వార్ (Social Media War) ఓ రేంజ్ లో సాగింది. ఆ మధ్య విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కు బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే బండ్ల ట్వీట్స్ కు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ల ఇచ్చారు. ఇద్దరి మధ్య ట్వీట్స్ వార్ తారాస్థాయికి చేరింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనేలా చేసుకుంటున్న ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ట్వీట్లతో వార్ సెటైర్లు వేశారు బండ్ల గణేష్..
మీకు ప్రతిరోజు మంచి సమాచారం అందిస్తూ.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతానని ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించారు. మార్గదర్శి సంస్థలో సోదాలపై విజయసాయిరెడ్డి ట్విటర్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల. అంతేకాదు.. రామోజీరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బండ్ల తప్పుపట్టారు. ఆయన ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించారని పేర్కొంటూ.. విజయసాయి రెడ్డి చేసిన ప్రతీ ట్వీట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్. అసలేం జరిగిందంటే..
మార్గదర్శి సోదాల కోసం విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారెంట్‌ని నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రామోజీరావుని టార్గెట్ చేస్తూ.. విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా విరుచుకుపడ్డారు. సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావ్, సమాచారం అడిగితే స్టే అంటావ్, మళ్లీ పారదర్శకత– ప్రజాస్వామ్యమంటూ నీతులు చెప్తావంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. ఏ తప్పూ చేయకపోతే విచారణను ఎదుర్కోవాలని అన్నారు. అంతేకాదు.. కొండపల్లి సీతారామయ్య రచనలను ప్రచురించే జీజే రెడ్డికి రామోజీ వెన్నుపోటు పొడిచారని… జీజే రెడ్డి ఆస్తిని, కొండపల్లి రచనలను దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు.
విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. జీజే రెడ్డిని రామోజీ రావు వెన్నుపోటు పొడిచిన విషయం మీకెవరు చెప్పారు? అని ప్రశ్నించాడు. కేవలం తెలుసుకోవాలనే ఆతృతతోనే అడుగుతున్నానన్నా అన్నారు. రామోజీ రావు 25 వేల కుటుంబాలకు ప్రతి నెలా జీవనోపాధి కల్పిస్తున్నారని, ఆతృతతో ఈ విషయం మీకు చెప్తున్నాన్నాడన్నారు.
మీకు ప్రతి రోజు మంచి సమాచారం అందిస్తాను మంచి విషయాలు చెప్తా మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా @VSReddy_MP అన్న ???? https://t.co/k5OhdyOX8N
— BANDLA GANESH. (@ganeshbandla) December 18, 2022
అక్కడితోనే ఆలేదు అయన. ప్రతి రోజు మంచి సమాచారం, మంచి విషయాలు చెప్తూ.. మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతానన్నాడు. రామోజీరావు వయస్సు 86 సంవత్సరాలని, ఇంకో పదేళ్లు కూడా బ్రహ్మాండంగా ఉంటారని, ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిచారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bandla Ganesh, Vijayasai reddy