BIG MIRACLE IN ANDHRA PRADESH LORD AMMA OPEN HERE EYS OPEN IN COCONUT AT EAST GODAVARI DISTRICT NGS
Miracle in Andhra Pradesh: దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో అమ్మవారి కళ్లు.. భక్తితో పూజలు చేసిన ప్రజలు
కొబ్బర కాయలో అమ్మవారి ఇళ్లు
Miracle in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వింత భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య రాముడు, సీత కంటి వెంట నీరు వచ్చింది. ఇక మరో ప్రాంతంలో బొప్పాయి పండులో వినాయకుడు వెలిసాడు.. ఆ వింతల గురించి మరిచిపోకముందే.. తాజాగా దేవుడికి కొట్టిన ఓ కొబ్బరి కాయలో అమ్మవారు కళ్లు తెరవడం చూసి అంతా షక్ అవుతున్నారు.
Miracle in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూఢ నమ్మకాలతో పాటు.. దైవ భక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆధ్యాత్మిక రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందింది. అందుకే ఎక్కడ ఏ మూలన చిన్న వింత కనిపించిన అది దేవుడి లీలే అని నమ్మిన వారు చాలా మంది ఉంటారు.. తాజాగా అందరూ షాక్ కు గురయ్యే ఓ అద్భుత సంఘటన తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)లో చోటు చేసుకుంది. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ (Coconut)లో స్వయంగా అమ్మవారి రూపం సాక్షాత్కరించింది. అది చూసిన ఆ భక్తుడి ఆనందానికి హద్దే లేకండా పోయింది.. ప్రస్తుత ఆ కొబ్బరికాయలో కనిపించిన అమ్మవారి కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిని దగ్గరగా చూసినవారంతా అమ్మవారి కళ్లు మాదిరి రెండు ఆకారాలు ఉన్నాయి అంటున్నారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో స్థానికులంతా దీన్ని ఆసక్తిగా చూసేందుకు క్యూ కట్టారు.. ఆ కొబ్బరి కాయలో ఉన్న కళ్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కుంకుమ, పసుపులతో అర్చనలు చేస్తున్నారు. అమ్మవారి చల్లని చూపు తమపై ఉండాలని వేడుకుంటున్నారు...
తూర్పు గోదావరి జిల్లాలోని వెల్లా మూర్తి స్థానిక షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే మూర్తి.. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా, ఓ కొబ్బరికాయ దొరికింది. వెంటనే ఆ కొబ్బరి కాయను స్థానికంగా కొలువైన సత్తెమ్మ తల్లి కి నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న మొక్కులో భాగంగా ఈ నెల 18న మూర్తి భార్య నాగ శ్రీవాణి, కుమారుడు శ్రీనివాసులు ఆ కొబ్బరికాయ కొట్టారు. ఆ కాయలో రెండు నేత్రాలు పెద్దగా కనిపించడంతో భయంతో వెంటనే వారు కింద పడేశారు.
కొబ్బరికాయలో కళ్లు ఉన్న విషయాన్ని భర్తకు చెప్పింది నాగశ్రీవాణి. ఆ కళ్లను చూసిన మూర్తి.. ఇదంతా అమ్మవారి మహిమగా భావిస్తున్నారు. కొబ్బరి ముక్కలు లోపలకు తెచ్చి పూజలు చేయడం ప్రారంభించారు. ఈలోగా స్థానికంగా ఉన్న ఓ మహిళకు మావుళ్ళమ్మ పూని మీ ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు కింద తాను ఉన్నానని.. వెంటనే తనకు కు గుడి కట్టించండి కోరింది అన్నారు. ఈ విషయం ఆ నోటా ఆ నోటా పాకడంతో తండోపతండాలుగా జనం తరలి వచ్చి ఈ వింతను చూసి వెళ్తున్నారు.
కొబ్బరికాయ లో ఉన్న కళ్ళను అమ్మవారి దైవం అంటూ పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నారు.
ఇటీవల ప్రకాశం జిల్లా (Prakasam District) కొనకనమిట్ల మండలంలోని మునగపాడులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. రోజులుగా రాముల వారికి పూజ చేద్దామని పూజారి సిద్ధమైతే.. ఆ సమయంలో రాముడి కళ్ల వెంట నీరు రావడంతో రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతుంది. చూసి ఆశ్చర్యపోయిన పూజరి.. ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందారు.
ఇటీవల కాలంలో ఏపీలో ఇలాంటి వింత ఘటనలో ఏపీలో ఎక్కడో ఒఖ చోటు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందంతా దేవుడి మహిమ అంటూ హిందువులు మాత్రం నమ్ముతున్నారు.. ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.