BIG FIGHT BETWEEN TWO OFFICERS FOR A POST OF CHIEF ACCOUNTANT OFFICE IN VISAKHA METROPOLITAN REGIONAL DEVELOPMENT AUTHORITY NGS VSP
CAO Post Fight: చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి కోసం ఫైట్.. వాట్సప్ లో వైరల్ పోస్టులు
చీఫ్ అకౌంట్ ఆఫీసర్ కోసం ఫైట్
VRMDA Fight: ఉన్నది ఒక్కటే పోస్టు.. కానీ దాని కోసం ఇద్దరు ఆఫీసర్లు ఢీ అండే ఢీ అంటున్నారు.. అయినా ఆ పదవికి ఎందుకంత క్రేజ్..? ఉన్నతస్థాయిలో ఉన్న ఆ ఇద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు..
P. Anand Mohan, Visakhapatnam, News18, CAO Post Fight in Andhra Pradesh: విశాఖపట్నం (Visakhapatnam) మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (CFO) పోస్టు కోసం ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు ఆ పోస్టు తనకు దక్కదనే అనుమానంతో వాట్సాప్ (Whats app)లో పోస్టులు పెడుతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గ్రూప్-1 ఆఫీసర్ల గ్రూపులో. తన సహచరులే సహకరించడం లేదంటూ నిందించారు. ఇప్పుడు అధికారుల మధ్య చర్చకు దారితీసింది. సంస్థ పరువు రోడ్డున పడిందని వీఎంఆర్డీఏ ఉద్యోగులు వాపోతున్నారు.
వీఎంఆర్డీఏ వార్షిక ఆదాయం సుమారు 120 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. బడ్జెట్ వేయి కోట్ల పైనే ఉన్నా.. ఖర్చు చేసేది మాత్రం 200 కోట్లకు మించదు. వీటికి సంబంధించిన బిల్లులన్నీ అకౌంట్స్ విభాగం నుంచే మంజూరవుతాయి. ఆ విభాగానికి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు. అన్ని ప్రభుత్వ (Government) సంస్థ ల్లాగే ఇక్కడ కూడా బిల్లులు తీసుకునే కాంట్రాక్టర్లు ఒక శాతం నుంచి 5 శాతం వరకు మామూళ్లు సమర్పించుకోవాల్సి వుంటుందనే ప్రచారం ఉంది.
ఈ పోస్టుకు మంచి డిమాండ్ ఉంటుంది. కొందరు ఇక్కడికి డెప్యుటేషన్‌పై వస్తారు. మరికొందరు వ్యక్తిగత అవసరాలు, కుటుంబ నేపథ్యంతో పోస్టింగ్ తెచ్చుకుంటారు. వీఎంఆర్డీఏ నిబంధనల ప్రకారం ఈ పోస్టులో స్టేట్ ఆడిట్ విభాగం అధికారులే పనిచేయాలి. సమర్థులైన అధికారులు వస్తే వారిని వీఎంఆర్డీఏ ఉన్నతాధికారులు వదులుకోవడానికి ఇష్టపడరు. వ్యవహారాలు సాఫీగా సాగిపోవాలని ఉద్దేశంతో డెప్యుటేషన్ ముగిశాక కూడా వారిని కొనసాగించాలని మాతృశాఖలకు లేఖలు రాస్తారు. ఈ విధంగా గతంలో విజయభారతి అనే అధికారిణి సుమారుగా పదేళ్లు ఆ పోస్టులో పనిచేశారు. ఇంకా అక్కడే కొనసాగడం తగదని వెళ్లిపోయారు.
ఆ తరువాత హరిప్రసాద్ అనే అధికారి అదే స్టేట్ ఆడిట్ విభాగం నుంచి వచ్చారు. ఆయన ఐదేళ్లు ఉన్నారు. ఆ తరువాత తప్పనిసరిగా మాతృ సంస్థకు వెళ్లాలనే నిబంధన వుండడంతో కాకినాడకు వెళ్లిపోయారు. విజయనగరం జిల్లా (Vizianagaram)లో ట్రెజరీ అధికారిణిగా పనిచేస్తున్న నిర్మలమ్మ గత నవంబరులో ఇక్కడికి సీఏఓగా వచ్చారు. ఆడిట్ విభాగం నుంచి కాకుండా ట్రెజరీ విభాగం నుంచి రావడం అప్పట్లో చర్చకు దారితీసింది.
ఆ తరువాత ఆ విభాగంలో జరిగిన కొన్ని అంశాలపై వీఎంఆర్డీఏ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. సరిదిద్దే ప్రయత్నాలు జరిగాయి. గత ఏడాది వరకు వీఎంఆర్డీఏలో సీఏఓ పోస్టులో ఎవరు వున్నారనేది బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అది నాన్ ఫోకల్ పోస్టు. కానీ కొద్ది కాలంగా అక్కడ జరుగుతున్న రచ్చతో చర్చ మొదలైంది.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే. నిర్మలమ్మకు ప్రభుత్వం ఏడాది కాలానికే డిప్యుటేషన్ ఇచ్చింది. ఈ నెలతో ఆమె పదవీకాలం ముగుస్తుంది. దాంతో ఆమె అక్టోబరు నెల ప్రారంభంలోనే తనను ఇంకో రెండేళ్లు ఇక్కడే కొనసాగించాలని కోరుతూ వీఎంఆర్డీఏ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు.
అయితే ఈ ఫైల్‌ను ఇక్కడి నుంచి పైకి సకాలంలో పంపడం లేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. అదీ కాకుండా ట్రెజరీ విభాగంలో తన బ్యాచ్మేట్లు ముగ్గురు ఉన్నారని, వారిలో ఇద్దరు తప్పనిసరిగా తనకు ఈ విషయంలో సహకరించాల్సి వున్నా...చేయడం లేదని ఆరోపిస్తూ ఆమె వాట్సాప్ గ్రూపులో పోస్టింగ్ పెట్టడంతో ఈ విషయం రచ్చకెక్కింది. ఇదే సమయంలో ఏడాది క్రితం ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లిన హరిప్రసాద్ విశాఖలోనే తన కుటుంబం వుందని చెబుతూ, తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని లెటర్ పెట్టుకున్నారు. రాజధాని స్థాయిలో అధికారులు తనకు సహకరించకుండా...ఆయన ఫైల్‌ను ముందుకు పెడుతున్నారని ఆరోపిస్తూ నిర్మలమ్మ మరిన్ని పోస్టులు పెట్టారు.
ఈ క్రమంలో వీఎంఆర్డీఏ ఉద్యోగుల గ్రూపులోను ఆమె మరికొన్ని పోస్టులు పెట్టారు. తాను పనిచేసిన ఈ 11 నెలల వ్యవధిలో ఏమి చేశారో అందులో పేర్కొన్నారు. దాంతో ఇక్కడ ఉద్యోగుల్లోను చర్చ మొదలైంది. ఇలా ఇద్దరు అధికారులు ఒక పోస్టు కోసం చేస్తున్న ప్రయత్నం వల్ల వీఎంఆర్డీఏ పరువు రోడ్డున పడిందని అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఏఓ సీటులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.