హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Puspha Effet: ఏపీలో రోజుకో పుష్పా సీన్.. కొత్త ఐడియాలతో సవాల్..? పోలీసులకే షాక్

Puspha Effet: ఏపీలో రోజుకో పుష్పా సీన్.. కొత్త ఐడియాలతో సవాల్..? పోలీసులకే షాక్

వీళ్ల తెలివి మామూలుగా లేదు

వీళ్ల తెలివి మామూలుగా లేదు

Puspha Effet: పుష్ఫ సినిమా ఎఫెక్ట్ జనాలపై బాగానే పడింది. ఓ వైపు శ్రీవల్లి పాట ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేకుండా పుష్ప సిగ్నేచర్ స్టెప్పును అంతా వాడేస్తున్నారు. నెట్టింట్లో సందడి చేస్తుంటే.. మరోవైపు స్మగ్లర్లు పుష్ప ఐడియాలను వాడేస్తే.. కొత్త కొత్త ఆలోచనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

ఇంకా చదవండి ...

Puspha Effet: బన్నీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమా (Pushpa Movie).. కలెక్షన్ల సునామీ సంగతి పక్కన పెడితే.. జనాల్లో ఈ సినిమా ఎఫెక్ట్ మామూలుగా లేదు.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా శ్రీవల్లి ఫీవర్ ఓ ఊపు ఊపేస్తోంది. చిన్నల నుంచి పెద్దల దాక.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా పుష్ప సిగ్నేచర్ స్టెప్పులతో నెట్టింట సందడి చేస్తున్నారు. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడ ఎవరూ తగ్గేదే లే అంటూ రెచ్చిపోతున్నారు. అయితే ఇదంత ఫన్నీగా ఉంది.. వైరల్ అవ్వడం సంతోషించాల్సిన విషయమే.. అయితే మరోవైపు పుష్పాను స్మగ్లర్ గా చూపించడం..తో అతడ్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు ప్రతి స్మగ్లర్లు.. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త కొత్తై ఐడియాలతో పోలీసులకు సవాల్ విసురుతూ ఉన్నారు. కొందరు సేమ్ పుష్పా సీన్లను ఫాలో అయిపోతే.. మరికొందరు తమ ఐడియాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు మద్యం స్మగ్లర్స్ (Liquor Smugglers) కూడా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని మద్యం ధరలను ఆసరాగా చేసుకుని.. పొరుగు రాష్ట్రాల మద్యంపై కన్నేశాయి మత్తు ముఠాలు. ఒడిషాలోని చీప్ లిక్కర్ ను కొనుగోలు చేసి.. బోర్డర్ దాటించి విశాఖకు తీసుకొస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్ పై యాభై నుంచి అరవై రూపాయలు అదనంగా వేసి అమ్మేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో నిఘా పెరగడంతో.. వేర్వేరు మార్గాల్లో అన్వేషిస్తున్నారు అక్రమార్కులు.

ఒడిషా (Odisha) లో మద్యాన్ని విశాఖకు డంప్ చేసేందుకు సరికొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. ఇటీవల ఏపీ వ్యాప్తంగా పోలీసులు నిఘా పెరిగింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీపై పోలీసులు ఫోకస్ చేయడంతో.. స్మగ్లింగ్ ముఠా కొత్త దారులను అన్వేషిస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ద్వారా తరలిస్తుంటే తనఖీలు ఎక్కువయ్యాయి. దీంతో కాస్త రూటు మార్చారు. తాజాగా వేరుశనగ పొట్టు మాటున మద్యాన్ని పెట్టి దిగుమతి చేస్తుండగా, అడవివరం లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారును ఆపి సోదాలు చేయగా, పది కేసుల ఒడిషా మద్యం పట్టుబడింది. దీంతో స్వామి నాయుడు అలియాస్ బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఓ గోడౌన్‌లో దాచివుంచిన మరిన్ని మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.


అయితే అక్కడ పదుల సంఖ్యలో ఉంటాయని ఊహించిన పోలీసులకు షాక్ తగిలింది. ఏకం 200కు పైగా కేసుల్లో పదివేల వరకు ఒడిస్సా మద్యం బాటిళ్లను గుర్తించారు అధికారులు. ఇంత భారీ ఎత్తున దిగుమతి ఎలా జరిగిందనే దానిపై ఆరా తీయగా, కేటుగాళ్ల స్కేచ్‌తో అధికారులే అవాక్కయ్యారు.

ఇదీ చదవండి : ఏపీలో మూడు రాజధానులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆయనేమన్నారంటే..?

విజయనగరం జిల్లా కొత్తవలస కు చెందిన స్వామి నాయుడు.. విశాఖకు చెందిన మరికొందరితో కలిసి పక్కాగా స్కెచ్ వేశాడు. వేరుశెనగ పొట్టును గోనె సంచుల్లో సగం వరకు నింపి ఒడిషా రాష్ట్రంలోని రాయగడ పంపిస్తున్నాడు. అక్కడ ఈ పొట్టు ను అన్లోడ్ చేయకుండానే.. అవే బస్తాల్లో మూడో కంటికి తెలియకుండా మద్యం సీసాలను నింపుతున్నారు. వాటిని విశాఖ తీసుకువచ్చి అడవివరంలోని ఓ గోడౌన్ లో డంప్ చేస్తున్నారు. తెచ్చిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా గత కొంత కాలంగా వీరి వ్యవహారం సాగిపోతుంది. అధికారుల తనిఖీల్లో కారు పట్టుబడటంతో ఈ ఒరిస్సా మద్యం గుట్టు బయట పడింది. అంతేకాదు.. ఆ మద్యం సీసాలపై ఎలాంటి బ్రాండ్, కంపెనీ పేరే ఏవీ లేవు. దీంతో అది కల్తీ మద్యం అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే మద్యంతో పాటు భారీగా గుట్కా, కైని ప్యాకెట్లు కూడా లభించాయి. వీటి విలువ దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizag

ఉత్తమ కథలు