Samantha song Male Version: ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా’ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పుష్ప సినిమా (Pushpa Movie) పాట ఇది. సమంత (Samantha) చేసిన తొలి ఐటెం సాంగ్ ఇది. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో "ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా" సాంగ్ అభిమానులను ఊపేస్తోంది. పాట లిరికల్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సాంగ్.. పెద్ద సెన్సేషన్‌గా మారింది. మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. పాట ఎంత పాపులర్ హిట్టయ్యిందో.. అంతే కాంట్రవర్సీలు కూడా వెంటాడుతున్నాయి. పాట సాహిత్యంలో కొన్ని పదాలు పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ కొన్ని ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అయితే .. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. కొందరు కోర్టును ఆశ్రయించారు..
‘మగబుద్థి వంకర బుద్థి’ అనే లిరిక్స్ మగవారిని చెడ్డవారిగా చూపించినట్టు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. దీనిని తొలగించాలంటూ ఏపీ భార్యా బాధితుల సంఘం హెచ్చరించింది. అయినప్పటికీ ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. ఇప్పుడు సమంత పాటకు కౌంటర్‌గా పేరడీ వచ్చింది. ప్రస్తుతం ఈ పేరడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ పాట లిరిక్స్‌కు పూర్తి ఆపోజిట్‌లో.. ఉన్న లిరిక్స్‌తో మేల్ వాయిస్ లో వచ్చిన ఓ పాట.. అందరూ తప్పక వినాల్సిన పాట ఇది...
View this post on Instagram
పుష్ప సినిమాలోని లిరిక్స్‌కు కౌంటర్‌గా ఈ పాటని రాశారా అనేలా.. లిరిక్స్ ఉన్నాయి. పుష్ప సినిమా రిలీజ్ డేట్ అయిన 17న ఈ పాట పేరడీ సాంగ్ ను యూట్యూబ్ లో వదిలారు. అంటే పాట యూట్యూబ్ లో పెట్టిన రెండు రోజుల్లో 20 లక్షల 15 వేల వ్యూస్ తో దూసుకుపోతోంది..
ఇదీ చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్నే వూరిస్తారు..బొడ్డు కిందకి చీరను కట్టి ముగ్గులో దింపేస్తారు.. అంటూ పాట స్టార్ట్ అవుతుంది. షాపింగ్, గీపింగ్ అంటూనే సర్వం నాకించేస్తారు.. సినిమా షికార్ల అంటూనే వాడేసి వదిలేస్తారు.. ఏటీఎమ్.. పేటీఎమ్ తేడా ఏమీ లేదండీ..మనీని తప్ప మనసు చూడరు.. మీ ఆడ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా పాపా.. ఊఊ అంటావా పాపా’’
ఇదీ చదవండి: ఇన్నాళ్లూ మాస్క్ లు వేసుకున్నారు.. ఇప్పుడు ఎవరు ఏంటో తెలిసిపోయిందంటూ రోజా ఫైర్
ఈ పాట పాడింది ఎవరో కాదు.. విజయనగరం జిల్లా (Vizianagaram District) చీపురుపల్లి మండలం కొర్లాం గ్రామానికి చెందిన రేలా రే రేలా బృందం సభ్యుడైన ఎల్లింటి రమణ మొదట ఈ పాటను రాసారు. తరువాత కొద్దిగా మార్పులు చేయాల్సి ఉండగా.. విజయనగరం జిల్లా తెర్లాం గ్రామానికి చెందిన ప్రశాంత్ ఈ పేరడీ పాటకు లిరిక్స్ ను మార్పులు చేసి మరింత తీర్చిదిద్దాడు. ఇక విశాఖపట్నంకు చెందిన జాన్ విక్టర్ సౌండ్ ఇంజనీర్ రీమిక్స్ చేసారు. మొత్తానికి పాట రెడీ అయిన తర్వాత యూట్యూబ్ లో వదిలారు. ఈ పాటను యూట్యూబ్ లో పెట్టినప్పటి నుండి.. సుమారు 20 లక్షల మంది చూశారు. ప్రస్తుతం ఈ పాటపై విపరీతమైన చర్చ నడుస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pushpa, Samantha Ruth Prabhu