Home /News /andhra-pradesh /

BIG ALERT TO VISAKHAPATNAM VIZIANAGARAM AND SRIKAKULAM JAWAD CYCLONE COMING JET SPEED NGS VZM

Cyclone Jawad Effect: ఉత్తరాంధ్రవైపు దూసుకొచ్చిన జవాద్ తుఫాను.. అత్యవసర పరిస్థితుల కోసం ఈ నెంబర్లు రాసి పెట్టుకోండి

ఉత్తరాంధ్రకు అలర్ట్

ఉత్తరాంధ్రకు అలర్ట్

Heavy Rains alert to Uttarandhra: ఉత్తరాంధ్ర ప్రజలకు మళ్లీ హుద్ హుద్ నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. జవాద్ దుఫాను.. రాకాసిలా విశాఖ వైపు దూసుకొస్తోంది. ఏ క్షణమైనా ఉత్తరాంధ్ర జిల్లాలపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. సో అంతా అలర్ట్ అవ్వండి.. ఈ నెంబర్లు దగ్గర పెట్టుకోండి..

ఇంకా చదవండి ...
    Jawad Effect to Andhra Pradesh:   ఉత్తరాంధ్రకు పెను ముప్పు తప్పదా..? జవాద్ ఊహించని వేగంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై దూసుకు వస్తోంది.  మరో హుద్ హుద్ అవుతుందా అనే భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఏపీ తీరం వైపు జవాద్ తుఫాన్ (Cyclone Jawad) దూసుకొస్తోంది.  వాయుగుండం తీవ్రంగా బలపడింది.  తీవ్ర వాయుగుండంగా.. మధ్యాహ్నానికి  కాసేపటికే బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం  వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్టణానికి  ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది.  మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా కాసేపట్లో జవాద్‌ తుఫాన్‌ (Jawan Cyclone) గా మారే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

    జవాద్ తుపాను సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. అది ఏక్షణమైనా ఉత్తరాంధ్రపై దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 30 కిలోమీటర్ల వేగంతో జవాద్‌ జెట్ స్పీడ్ తో దూసుకువస్తోంది. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది. దీంతో ప్రస్తుతం బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భయపెడుతోంది. తీరం వెంబడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయ్. ఇదే పరిస్థితి కొనసాగితే ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రలో కనీసం 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరికలు అందుతున్నాయి.

    ఇదీ చదవండి : సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక

    ఉత్తరాంధ్రపై విరుచుకుపడేందుకు దూసుకొస్తున్న జవాద్ మామూలు తుఫాను కాదు. మరోసారి హుద్ హుద్ భయం వెంటాడుతోంది. అందుకే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఈ నంబర్లను జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి.

    ఇదీ చదవండి : సీఎం వరద పర్యటన దేనికి.. పరామర్శకా? సెల్ఫీల కోసమా? లోకేష్ ఫైర్

    విజయనగరం జిల్లాలో కంట్రోల్ రూముల నెంబ‌ర్లు ఇవే..
    1. విజ‌య‌న‌గ‌రం డివిజన్ ఆర్‌డిఓ ఆఫీస్ 8922276888
    2.పార్వ‌తీపురం డివిజ‌న్ స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీస్ 7286881293
    మండలాలి వారిగా నెంబర్లు..
    1.భోగాపురం : 8074400947
    2.బొండ‌ప‌ల్లి : 9494340170
    3.చీపురుప‌ల్లి : 9951520101
    4.ద‌త్తిరాజేరు : 6303131206
    5.డెంకాడ : 9490036688
    6.గ‌జ‌ప‌తిన‌గ‌రం : 9963456373
    7.గంట్యాడ : 9440178300
    8.గ‌రివిడి : 9391626256
    9.గుర్ల : 8639657970
    10.జామి : 9493072795
    11.కొత్త‌వ‌ల‌స : 9063452990
    12.ఎల్.కోట : 6302060131
    13.మెంటాడ : 6301377418
    14.మెర‌క‌ముడిదాం : 6301740792
    15.నెల్లిమ‌ర్ల : 9381494140
    16.పూస‌పాటిరేగ : 9948748334
    17.శృంగ‌వ‌ర‌పుకోట : 8500045143
    18.వేపాడ : 9440712421
    19.విజ‌య‌న‌గ‌రం : 9100497329
    20.పార్వ‌తీపురం : 9492895364
    21.బ‌లిజిపేట : 9110535874
    22.సీతాన‌గ‌రం : 9912390971
    23.కురుపాం : 9492995878
    24.కొమ‌రాడ : 9492506558, 8247008956
    25.జిఎల్ పురం : 8309085355
    26.జియ్య‌మ్మ‌వ‌ల‌స : 9346556187, 9948614865
    27.గ‌రుగుబిల్లి : 8142995131
    28.బొబ్బిలి : 8919598043
    29.బాడంగి : 8106877661, 8309239166
    30.తెర్లాం : 9182881540
    31.రామ‌భ‌ద్రాపురం : 9989369511
    32.సాలూరు : 9392687005
    33.పాచిపెంట : 9494972582
    34.మ‌క్కువ : 8374752591

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Floods, AP News, Heavy Rains, Vizianagaram

    తదుపరి వార్తలు