Home /News /andhra-pradesh /

BIG ALERT TO ANDHRA PRADESH PEOPLE TODAY AND TOMORROW HEAVY RAIN FALL SOME DISTRICTS NGS

Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. నేడు రేపు భీకర వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?

ఏపీకి భారీ వానలే వానలు (twitter)

ఏపీకి భారీ వానలే వానలు (twitter)

Rain Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అలర్ట్.. ఈ రెండు రోజులు చాలా అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే భీకర వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఈ ప్రభావం ఏఏ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో హెచ్చరిక జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ. 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే అని హెచ్చరికలు పంపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో సోమ, మంగళవారం రెండు రోజులు భీకర వర్షాలు పడే అవకాలు ఉన్నాయని సూచించింది.


    సెంట్రల్ బేలో అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి.. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.. దీంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


    తాజా అల్ప పీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో మత్య్సకారులు వేటకు సముద్రంపైకి వెళ్లవద్దని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.. ఇప్పటికే కోస్త ఆంధ్రా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా అలలు ఎగసి పడుతున్నాయి. ఏ క్షణమైనా భారీ వానలు ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది.


    అధికంగా ఉత్తరాంధ్ర పై ఈ ప్రభావం ఉండనుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తాదని చెప్ప్పారు. విశాఖ నగరం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడ నగరంతో పాటు గుంటూరు, ఉభయగోదావరి, కృష్ణా, కోనసీమ జిల్లాల్లోని వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి కర్నూలు నగరం, తెలంగాణ, ఉత్తర ప్రకాశం, నంద్యాల జిల్లా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


    ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. విశాఖ బీచ్ దగ్గర అలలు భారీగా ఎగసి పడుతున్నాయి.


    తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయి. రేపు ఉదయం వరకు కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.


    mahalakshmi express,mahalaxmi express in flood,mumbai flood,mumbai rains,rains in mumbai,mahalaxmi express train,badlapur train in flood,train in flood,train stuck in flood,mahalakshmi express train stuck,mahalaxmi express,metrolite train in india,heavy rain in mumbai,train flood update,mumbai rains today,train,maharashtra floods,heavy rains,mumbai rains 2019,mumbai rains news,heavy rains in mumbai today
    ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.


    ఇప్పటికే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  రేపు కూడా 9 జిల్లాల్లో భీకర వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, IMD, Weather report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు