హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains: ఏపీకి పొంచి ఉన్న మరో ఉపద్రవం.. రాయలసీమకు ఏమైంది అంటూ జనంలో భయం భయం

Heavy Rains: ఏపీకి పొంచి ఉన్న మరో ఉపద్రవం.. రాయలసీమకు ఏమైంది అంటూ జనంలో భయం భయం

ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

heavy rains to andhra pradesh: వర్షాల కోసం మొహం వాచేలా ఉండే.. రాయలసీమలో ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ ప్రాంతంపై వరుణు పగబట్టాడా..? లేక ఆశాకానికి చిల్లు పడిందా అనే స్థాయిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో ఉపద్రవం తప్పదనే హెచ్చరికలు అందుతున్నాయి.

ఇంకా చదవండి ...

  Heavy rains alert to  Andhra pradesh: అమ్మో ఇవేం వానలు అని  భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వానలు ఇప్పటిలో వదలవా..? వరుణుడు ఎందుకు ఇంతలా పగబట్టాడు అనే భయపడాల్సి వస్తోంది. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చిత్తూరు (Chitoor), నెల్లూరు (Nellore), కడప (Kadapa), అనంతపురం (anantapuram) జిల్లాలను వాను ముంచెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు.. వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.  ఆ వదర ముంపు నుంచి రాయలసీమ కొంత కూడా తేరుకోలేదు.. కానీ తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దానికి తోడు అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు అందుతున్నాయి.

  ఏపీకి మరో ఉపద్రవం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఈ హెచ్చరికే భయపడేలా చేస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా దక్షిణాంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు కకావికలమయ్యాయి. ముఖ్యంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వ, ప్రైవేలు ఆస్తులు ధ్వసం అయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో నైరుతి బంగాళాఖాతంలో.. దక్షిణ శ్రీలంక తీరం దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. కోమరిన్ ప్రాంతం, దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది. ఇది సగటు సముద్ర మట్టానికి.. 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  ఇదీ చదవండి : కరవు సీమలో ఎప్పుడూ చూడని అద్భుతం.. ఆగకుండా ఉబికి వస్తున్న పాతాళ గంగ

  అలాగే మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో.. సుమారు నవంబర్ 29 తేదీకల్లా ఏర్పడవచ్చని, తిరుపతి, నెల్లూరులో 13 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని.. వాతావరణ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ తరువాత 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనిపలు ప్రాంతాల్లో.. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

  ఇదీ చదవండి : రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.. కౌరవసభలో అడుగు పెట్టనన్న చంద్రబాబు..

  ఈ నెల 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ, యానాంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది.

  ఇదీ చదవండి : చీర కొనుక్కుందని రాక్షసత్వం.. ప్రేమించి పెళ్లాడాడు.. కానీ నరకం చూపించాడు

  తాజా హెచ్చరికల నేపథ్యంలో అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.  తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  అలాగే పేరూరు చెరువులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా వరదను తిరుపతిలోకి రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేసి.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాతకాల్వ నుంచి స్వర్ణముఖిలోకి నీళ్లు మళ్లిస్తున్నారు. సహాయక చర్యలపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh

  ఉత్తమ కథలు