హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

10th Exam Fees: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు ఎప్పటి వరకు అంటే.. సైన్స్ పేపర్ మార్పు

10th Exam Fees: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు ఎప్పటి వరకు అంటే.. సైన్స్ పేపర్ మార్పు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

10th Exam Fees: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష ఫీజు గడువును నిర్ణయించారు. మరోవైపు సైన్స్ పేపర్ కు సంబంధించి కీలక మార్పు చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  10th Exam Fees: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి (10th Class) పబ్లిక్ పరీక్షకు ప్ర్రిపేర్ అవుతున్న వారికి బిగ్ అలర్ట్.. మరో మూడు.. నాలుగు నెలల్లోనే పరీక్షలు జరిగనున్నాయి. అయితే ఈ పబ్లిక్ పరీక్షల ఫీజు (Public Exam Fees) ను ఈ నెల 25 నుండి డిసెంబర్ 10వ తేదీ లోగా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి పేర్కాన్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఒక్కో విద్యార్థి 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, నిర్దేశించిన గడువులోగా ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగానికి జమ చేయాలని ఆయన సూచించారు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా.. ఈ గడువు దాటితే.. డిసెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ లోపు.. 50 రూపాయలు అదనపు రుసుం.. అది కూడా దాటితే.. డిసెంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీలోపు 200 రూపాయలు.. ఒకవేళ 26 నుంచి 30వ తేదీలోగా 500 రూపాయల అపరాధ రుసుముతో కలిపి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఫీజులతో పాటు విద్యార్థుల రోల్‌ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

  మరోవైపు ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు మరో కీలక సూచన.. రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్స్ పరీక్ష ఇక నుంచి ఒకే పేపర్ గా జరుగుతుందని అధికారులు తెలిపారు. గతంలో లా సైన్స్ లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేరువేరు పేపర్లుగా కాకుండా.. ఇకపై ఒకే ప్రశ్నపత్రం తో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టు ల ప్రశ్నలను రెండు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వాలని నిర్ణయించారు.

  ఈ విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్న పత్రాలను రూపొందించారు. బ్లూ ప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. కాగా, గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు.

  ఇదీ చదవండి : నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?

  మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు.. రెసిడెన్సియల్ స్కూళ్లలో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు.. విద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జగరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.. ఇంకా సమయం చాలానే ఉంది కాబట్టి.. త్వరగా సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: 10th Class Exams, Andhra Pradesh, AP News, Ssc exams