Home /News /andhra-pradesh /

BHUMA AKHILA PRIYA STAGES SUDDEN PROTEST IN ALLAGADDA IN SUPPORT OF FARMERS BA

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు, భూమా అఖిల ప్రియ సడన్ నిర్ణయం

ఆళ్లగడ్డలో రాస్తారోకోలో పాల్గొన్న భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (Image; Bhuma Akhila Reddy/ Twitter)

ఆళ్లగడ్డలో రాస్తారోకోలో పాల్గొన్న భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (Image; Bhuma Akhila Reddy/ Twitter)

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ సడన్‌గా ధర్నాకు దిగారు. రైతులకు న్యాయం చేయాలంటూ ఆమె నిరసన చేపట్టడంతో అక్కడ టెన్షన్ నెలకొంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో (Allagadda) ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) సడన్‌గా ధర్నాకు దిగారు. రైతులకు న్యాయం చేయాలంటూ ఆమె నిరసన చేపట్టడంతో అక్కడ టెన్షన్ నెలకొంది. ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. వారికి పరిహారం చెల్లించకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నవంబర్ నెలలో నివర్ తుఫాన్ (Cyclone Nivar) కారణంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు పంటలను నష్టపోయారు. దీంతో రైతులకు న్యాయం చేయాలంటూ భూమా అఖిలప్రియ రైతులతో కలసి ఆళ్లగడ్డలో సడన్‌గా ధర్నాకు దిగారు. భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు.

    భూమా సడన్ ధర్నాతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రైతులు, నేతలు తమ ధర్నాను విరమించాల్సిందిగా కోరారు. ట్రాఫిక్ జామ్ అయిందని, వెంటనే నిరసన విరమించాలని కోరారు. అలాగే ధర్నాకు అనుమతి లేదనే విషయాన్ని పోలీసులు భూమా దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ నేతలతో పాటు రైతులను కూడా వెంటనే ధర్నా విరమించాలని పోలీసులు కోరారు. కానీ, పోలీసుల విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. తమ నిరసనను కంటిన్యూ చేశారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకపోతే ఆళ్లగడ్డలో మళ్లీ పాత రోజులు వస్తాయని ప్రభుత్వాన్ని భూమా అఖిలప్రియ హెచ్చరించారు.



    డిసెంబర్ నెలాఖరకు పంటల బీమా చెల్లిస్తామన్న ప్రభుత్వం
    మరోవైపు 2019 సీజన్ కు సంబంధించి పంటనష్టంపై బీమా పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం పేరుతో 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్లు జమ చేసింది. డిసెంబర్ 15న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు మంచి చేయడంలో మరో అడుగు ముందుకు వేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్సు కడితే ఎంత ప్రయోజనం కలుగుతుందనేది చేసి చూపిస్తున్నామన్నారు. గతంలో పంటల బీమా ఎవరికి అందుతుందో రైతులకే తెలియని పరిస్థితి ఉండేదని.., ప్రీమియం దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్న పరిస్థితి కూడా ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Bhuma Akhilapriya, Cyclone Nivar, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు