భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చిన విశాఖ గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి..

ప్రతీకాత్మక చిత్రం

గత అర్ధరాత్రి విశాఖలో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన ప్రజలకు భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన విష వాయువుతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

  • Share this:
    గత అర్ధరాత్రి విశాఖలో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన ప్రజలకు భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన విష వాయువుతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వందల మంది ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. తమకు ఏం జరుగుతుందో తెలీకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 3 కిలోమీటర్ల మేర విష వాయువు వ్యాపించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కాగా, గ్యాస్ లీక్ వల్ల కళ్లు కనిపించక బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా.. ముగ్గురు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్.. విశాఖ కలెక్టర్‌కు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున అధికారులు, జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు ప్రారంభించారు.

    కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటన భోపాల్ విషాదాన్ని గుర్తు చేసింది. 1984లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 4వేల మంది మృతిచెందారు. యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువు విడుదలైన 24 గంటల్లోనే 3 వేల మందికి పైగా చనిపోయారని అంచనా. ఆ తరువాత మరి కొన్ని వేల మంది ఆ విషపు గాలులకు, అనంతర పరిణామాలకు బలయ్యారు. అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విధ్వంసం. బతికి ఉన్న వాళ్ళలో కూడా వేలాది మంది ఆ ప్రభావానికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: