కరోనాతో శ్రీ రామ నవమి వేడుకలు పరిమిత సంఖ్యతో ఆలయాలకే పరిమితం అయ్యాయి. నిన్న భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. లాక్డౌన్ నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా శ్రీరామ నవమి వేడుకలను మిథిలా స్టేడియంలో కాకుండా స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించే బేడా మంటపంలోనే కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు లేకుండా రామయ్య కల్యాణం నిర్వ హించడం ఇదే తొలిసారని అర్చకులు తెలిపారు. అయితే, ఈ రోజు జరగాల్సిన పట్టాభిషేక మహోత్సవం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. పట్టాభిషేక మహోత్సవానికి కూడా తక్కువ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.
అటు.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంత పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయానికి భక్తులను ఆహ్వానించడం లేదు. అర్చకులు మాత్రం రోజూ వారీ పూజలు చేస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.