భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో భాగం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఇప్పుడు భద్రాచలం కూడా తమదేనని ఏపీ సీఎం చంద్రబాబు తాను ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే, అక్కడ ప్రకటిస్తున్నారు. తద్వారా త్వరలోనే భద్రాచలాన్ని కూడా ఏపీలో కలిపేసుకుంటారా అన్న అనుమానాలు కలగడం సహజం. నందిగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మరోసారి ఇదే మాట అన్నారు. భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దే అన్నారు. తామే అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రతిసారీ చంద్రబాబు ఇదే కామెంట్ చెయ్యడానికి ప్రధాన కారణంగా పోలవరం ప్రాజెక్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే... ముంపు ప్రాంతాల్లో భద్రాచలం కూడా చేరుతుందనీ, ఇందుకు సంబంధించి ఎలాంటి రక్షణా లేనందువల్ల ఈ ప్రాజెక్టును నిర్మిస్తే భద్రాచలానికి ప్రమాదం అని టీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
నందిగామ ప్రచారంలో భాగంగా చంద్రబాబు... ప్రతీ ఇంటికి పెద్ద కొడుకునయ్యాననీ పింఛన్లు పెంచి అండగా ఉంటానని చెప్పాననీ, మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. సోమవారం పసుపు కుంకుమ డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.4వేలు ఇచ్చామన్నారు చంద్రబాబు.
ఇవి కూడా చదవండి :
వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా... రాజధానిని తరలిస్తారా... నారా లోకేష్ మాటల్లో నిజమెంత...
జగన్ నాపై దాడులు చేయిస్తున్నాడు... దమ్ముంటే డైరెక్టుగా చర్చకు రావాలి : కే ఏ పాల్
పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...
పిల్లల్ని బడికి పంపితే... వైసీపీ ఇస్తానన్నది రూ.15,000... టీడీపీ ఇస్తానంటున్నది రూ.18,000
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu