Home /News /andhra-pradesh /

BEST TOURIST SPOTS IN ANDHRA PRADESH NEW PLACES FOUND IN KONASEMA SURROUNDINGS NGS

Tourist Spot: కేరళతో పోటీ పడుతున్న కొనసీమ.. తెరపైకి కొత్త టూరిస్ట్ స్పాట్లు.. ప్రత్యేకతలివే

కేరళకు పోటీగా కోనసీమ

కేరళకు పోటీగా కోనసీమ

Best Tourist Spots: కేరళతో పోటీ పడేందుకు కొత్త పర్యాటక ప్రాంతం రెడీ అవుతోంది. ఇప్పటికే పలు సుందర ప్రదేశాలు అద్భుత అనూభూతినిస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ నయా కేరళగా గుర్తింపు పొందుతోంది.

  New Tourist Spots:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యాటక సందడి పెరుగుతోంది. రోజు రోజుకూ కొత్త ప్రదేశాలు  (New Tourist Spots) తెరపైకి వస్తున్నాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా కొనసీమ నయా కేరళగా అవతరిస్తోంది.  పచ్చని చెట్లు.. మనసు దోచే అందాల మధ్య లాహిరి లాహిరిలో అంటూ పడవ ప్రయాణం చేస్తూ.. విందు ఆరాగించాలి అంటే.. ఇప్పుడు కేరళ  (Kerala )వరకు వెళ్లక్కర్లేదు.  సరిగ్గా అక్కడ ఎలా ఉంటుందో.. అలాగే మన కోనసీమ కూడా అదే ఫీలింగ్ కలిగించనుంది.  ఇప్పటికే చాలా వరకూ గ్రామలు, నదీ పాయలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. మరిన్ని గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. అసలు కొందరు చూడని ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు ఇంకా కోనసీమ జిల్లాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

  అటు సముద్రం, ఇటు గోదావరి నదీ (Godavari River) పరివాహక ప్రాంతంలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాయి. కేరళ తరహా అందాలను మన  కోనసీమ జిల్లాలోనే చూడొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం.. విందు, వినోదాలతో ఆహ్లాదకరంగా గడిపేందుకు రెడీ అవ్వండి..

  ఇదీ చదవండి: వారి కోసం.. కొత్తమంత్రుల అధికారాలకు కోత పడుతుందా..! పదవిలో ఉన్న వారు డమ్మీలేనా?

  గోదావరి జిల్లాలు (Godavari Districts) అన్నపూర్ణ మాత్రమే కాదు. పర్యాటక ఆకర్షణ కూడా పెట్టింది పేరు.  జీవనది గోదారమ్మ ఎన్ని పాయలు తీసుకుంటుందో అన్నింటా అందాలే ఆహ్లాద పరుస్తూ ఉంటాయి.  కొత్తగా ఆవిర్భవించిన కోనసీమ జిల్లా కొబ్బరికి మాత్రమే కాదు. గోదారమ్మ అందమైన పాయలకు కూడా ప్రసిద్ధి. మరెన్నో సరస్సులకు అలవాలంగా కూడా ఉంది.

  ఇదీ చదవండి: టార్గెట్ 2024 గా ఊహించని వ్యూహం.. ఏడాదిలోనే వాతలు.. వ్యతిరేకత లేకుండా జనంలోకి వెళ్తారా..?

  పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే వరిచేలు.. గలగల పారే సెలయేర్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తూ తలూపే కొబ్బరిచెట్లు.. ఆప్యాయత, అనురాగాలతో అక్కున చేర్చుకునే కోనసీమ జిల్లా ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోనసీమలోని మలికిపురం మండలం దిండిలో టూరిజం రిసార్ట్స్‌తో పాటు సమీపంలో మరోమూడు ప్రైవేటు రిసార్ట్స్‌ ఉన్నాయి. సోంపల్లిలో కోనసీమ రిసార్ట్స్‌, ఓడలరేవులో సముద్ర రిసార్ట్స్‌, అయినవిల్లిలో విల్లా రిసార్ట్స్‌, పాశర్లపూడి, ఆదుర్రులో పర్యాటకశాఖ రిసార్ట్స్‌లతో పాటు యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు రిసార్ట్స్‌, కోరంగి, కోటిపల్లి, నదీ తీరాన, యానాం గౌతమీ తీరాన పుదుచ్చేరి రాష్ట్రంలో ప్రత్యేక అతిథి గృహాలు పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

  ఇదీ చదవండి: తగ్గేదేలే అంటున్న మాజీ మంత్రి.. పోరు అధిష్టానం పైనా..? పార్టీకి నష్టం తప్పదా..?

  కొన్ని రిసార్ట్స్‌ను స్వల్ప మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా సినీనటి రోజా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కోనసీమ జిల్లాను పర్యాటక జిల్లాగా అభివృద్ధి చేసే ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంది. వశిష్ట నది చెంతన మలికిపురం మండలం దిండిలో కేరళ తరహాలో ఉన్న హౌస్‌బోట్లు ద్వారా నదీ విహారాలు సాగించవచ్చు. దిండి రిసార్ట్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతిగదులతో పాటు నాలుగు హౌస్‌బోట్లు, ఒక వశిష్టబోటు, స్పీడు బోట్లు ఉన్నాయి.  యానాం నుంచి బోట్ల ద్వారా సాగర సంగమ విహారం, బోడసకుర్రు, సోంపల్లి, అంతర్వేది, సఖినేటిపల్లి, ఎదుర్లంక, మురమళ్ల, దిండి, కోటిపల్లి, వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో బోటు షికార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాట్రేనకోన మండలం కందికుప్ప, తాళ్లరేవు మండలం కోరంగి నుంచి మడ అడవుల్లో పడవల ద్వారా విహారయాత్ర సాగించడానికి అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది.

  ఇదీ చదవండి: సినీ.. మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తొలిసారి ఏపీ ఫుల్ కిక్కు ఇచ్చే థియేటర్.. ప్రత్యేకతలేంటంటే?

  కోనసీమలోనే సుమారు 50 కిలోమీటర్ల పైబడిన సముద్ర తీర ప్రాంతం కోనసీమ జిల్లాకు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా మారింది. నిత్యం తీర ప్రాంతాల్లోని బీచ్‌లన్నీ పర్యాటకులతో సందడిగా ఉంటున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా వేలాది మంది ఈ బీచ్‌ల్లో పార్టీలు ఏర్పాటు చేసుకుని విందు, వినోదాలతో పాటు క్రీడా కార్యక్రమాలతో ఆనందంగా గడుపుతుంటారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఓడలరేవు, కొమరగిరిపట్నం, కేశనపల్లి, కేశవదాసుపాలెం, చింతలమోరి, అంతర్వేది, ఎస్‌.యానాం, చిర్రయానాం, బ్రహ్మసమేథ్యం బీచ్‌లు వేలాదిమందితో కళకళలాడుతుంటాయి. ఇంకో పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతం ఆత్రేయపురం. ఆత్రేయపురం పూతరేకులు అంటే ఠక్కున గుర్తొస్తుంది. ఇక ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారులో ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో ఉన్న పిచ్చికలంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Best tourist places, East Godavari Dist

  తదుపరి వార్తలు